CM KCR : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్

భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

CM KCR : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్

Kcr

CM KCR : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేశామని తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పాడుబడ్డ ఇళ్లను గుర్తించి కూల్చివేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించామని పేర్కొన్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామని తెలిపారు.

తెలంగాణలో వర్షాలు, పరిస్థితులపై ఆదివారం(జులై 10, 2022) సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లాల్లో పరిస్థితులను సీఎం తెలుసుకున్నారు. భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు.

Telangana Holidays : భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు

ప్రస్తుతం గోదావరిలో 9 లక్షల 10 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉందని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ రేపు ఉదయానికి నిండుతుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. హెలికాప్టర్ల కోసం ఎయిర్ ఫోర్స్ ను సంప్రదిస్తున్నామని చెప్పారు. కల్వర్టుల మీద నీరు ప్రవహిస్తున్నప్పుడు దాటే సాహసాలు చేయొద్దన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల చెరువులు తెగిపోయాయని వెల్లడించారు. అనవసర సాహసాలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

గోదావరి 10 లక్షలు దాటితే మంగపేట, ఏటూరి నాగారం, రామన్నపేటలో ప్రమాదం జరగొచ్చని తెలిపారు. కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపామని తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటలు, డ్యామ్ లు, రిజర్వాయర్లలో నీటి పరిస్థితిలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Heavy Rains : తెలంగాణలో దంచికొడుతున్న వానలు

వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఆదేశించారు.విద్యుత్, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జనజీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. అవరమైతే రక్షణ చర్యలకు హెలికాప్టర్లు వినియోగించాలని సూచించారు.