CM KCR : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రంటులు, టెంటుల పంథా నుంచి భారత్ బయటపడాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు ప్రధానులుగా కావడం.. పార్టీలు మారి అధికారంలోకి రావడం ముఖ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య...

CM KCR : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Kcr

TRS Plenary : జాతీయ రాజకీయలపై మరోసారి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం జరిగిందని ప్లీనరీ సాక్షిగా ఆయన ప్రకటించారు. మత రాజకీయాలు నడుపుతూ దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. కలలు కని సాకారం చేసుకోవచ్చని తెలంగాణ నిరూపించడం జరిగిందని తెలిపారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలని.. సరైన పంథాలో నడిపించేందుకు సరికొత్త సిద్ధాంతాలు కావాలని మరోసారి స్పష్టం చేశారు. ఇన్ని ఏండ్ల కాలంలో ఏ రంగం అభివృద్ధి చెందింది ? అని సూటిగా ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి.. బీజేపీయేతర సీఎంలు, ఇతర నేతలతో చర్చిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : VAT Fuel Row: రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలన్న ప్రధాని వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ సూపర్ కౌంటర్

2022, ఏప్రిల్ 27వ తేదీ బుధవారం టీఆర్ఎస్‌ 21వ ఆవిర్భావ వేడుకలు హైద‌రాబాద్‌ లోని హెచ్‌ఐసీసీలో జరిగాయి. పలు తీర్మానాలు ఆమోదించిన అనంతరం సీఎం కేసీఆర్ సభను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఫ్రంటులు, టెంటుల పంథా నుంచి భారత్ బయటపడాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు ప్రధానులుగా కావడం.. పార్టీలు మారి అధికారంలోకి రావడం ముఖ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఫలితాలు ప్రజలకు అందాలని, పనికి మాలిన అలజడులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే భయంకరమైన పరిణామాలు సంభిస్తాయని హెచ్చరించారు. ప్రసంగాల హోరు, అబద్ధాలు తప్ప దేశానికి జరిగిందేమీ లేదని..దేశానికి ఏమి చేయలేదు కాబట్టే.. పోలరైజేషన్ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.

Read More : TRS Plenary : కేంద్ర సర్కార్‌‌పై కేటీఆర్ నిప్పులు.. ప్లీనరీలో పవర్ ఫుల్ స్పీచ్

విధ్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, మనుష్యుల మధ్య విధ్వేష పూరిత వాతావారణం కావాలా ? దేశంలో అశాంతి వాతావరణం చెలరేగేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మనిషి కోసం మతమా ? మతం కోసం మనిషా ? ప్రజలు కోరుకొనేది శోభా యాత్రలు, కత్తుల ప్రదర్శనలా ? అంటూ బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించారు. అశాంతిని నాగరిక సమాజం కోరుకుంటుందా ? రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు.