CM KCR : గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా రద్దు : సీఎం కేసీఆర్

తెలంగాణలో గంజాయి సాగుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇకపై గంజాయి సాగు చేసేవారికి రైతు బంధు, రైతు బీమా కట్ చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

CM KCR : గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా రద్దు : సీఎం కేసీఆర్

Kcr

CM KCR serious about cannabis cultivation : తెలంగాణలో గంజాయి సాగుపై సర్కార్ ఉక్కుపాదం మోపనుంది. రాష్ట్రంలో గంజాయి సాగుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇకపై గంజాయి సాగు చేసేవారికి రైతు బంధు, రైతు బీమా కట్ చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. గంజాయిపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి.. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. గంజాయి సాగు చేసే భూముల పట్టాలు కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆర్ వో ఎఫ్ ఆర్ లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఉన్నతస్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణపై త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో ఒక్క గంజాయి మొక్క కూడా కనిపించకూడదన్నారు. హైదరాబాద్ కు గంజాయి రాకుండా పటిష్ట వ్యూహం అమలు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ ప్రమాదంపై పాఠ్య పుస్తకాల్లో సిలబస్ గా చేర్చాలని సూచించారు.

TSRTC Jobs : RTCలో ఉద్యోగాలు ప్రకటించిన సజ్జనార్

తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించేందుకు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వచ్చిందన్నారు.