MGM Medical Scam : వరంగల్ ఎంజీఎంలో మెడికల్ స్కామ్ పై సీఎం సీరియస్, విచారణకు ఆదేశం

హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైనది వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి. అలాంటి ఎంజీఎంలో మెడికల్ స్కామ్ కలకలం రేపింది. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. అధికారులను ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. కోవిడ్ వార్డుల్లో అక్రమ దందాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రంగంలోకి దిగిన అధికారులు మందులు, ఇంజెక్షన్ల లెక్కలు తీస్తున్నారు.

MGM Medical Scam : వరంగల్ ఎంజీఎంలో మెడికల్ స్కామ్ పై సీఎం సీరియస్, విచారణకు ఆదేశం

Mgm Medical Scam

MGM Medical Scam : హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైనది వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి. అలాంటి ఎంజీఎంలో మెడికల్ స్కామ్ కలకలం రేపింది. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. అధికారులను ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. కోవిడ్ వార్డుల్లో అక్రమ దందాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రంగంలోకి దిగిన అధికారులు మందులు, ఇంజెక్షన్ల లెక్కలు తీస్తున్నారు.

ఎంజీఎంలో ఆక్సిజన్ ఫ్లో మీటర్లు 1,100 ఉండాలి. కానీ, ఇప్పుడవి 400 మాత్రమే ఉన్నాయి. ఇక 6వేల 378 రెమ్ డెసివిర్ ఇంజక్షన్లలో సగం కూడా ఎంజీఎంకు చేరలేదు. దీని వెనుక మెడికల్ మాఫియ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంజీఎంలో ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, రెమ్ డెసివిర్ దందాను టెన్ టీవీ వెలుగులోకి తెచ్చింది.

ఓ పక్క కరోనాతో ప్రాణాలు పోతుంటో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సిబ్బంది అరాచకాలు సాగిస్తున్నారని, రోగుల నుంచి భారీగా డబ్బులు గుంజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆక్సిజన్ ఫ్లో మీటర్లను సిబ్బంది మాయం చేస్తున్నారు. అలా 700ల ఆక్సిజన్ ఫ్లో మీటర్లను దొంగిలించి మరో చోట అమ్ముకుంటున్న వైనం బయటపడింది. ఎంజీఎం సిబ్బంది ఆక్సిజన్ ఫ్లో మీటర్లు దొంగిలించటమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లను మార్చి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆక్సిజన్ ఉన్న సిలిండర్లను తీసేసి రోగులకు ఖాళీ సిలిండర్లను అమర్చుతున్నారు. అదేమని ప్రశ్నించి రోగులపైనా.. వారి బంధువులపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతే ఇష్టమైతే ఉండండీ లేకపోతే వెళ్లిపోండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని రోగులు వాపోతున్నారు.

ఓ పక్క ప్రైవేటు ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ఎంజీఎంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. మరోపక్క ఆసుపత్రి సిబ్బంది చేతివాటం చూపిస్తూ రోగులకు అందాల్సిన వైద్య సదుపాయాలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.