CM KCR : బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

బండి సంజయ్ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వరి పంట అంశంపై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని విమర్శించారు.

CM KCR : బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

Cm Kcr Strong Counter To Bandi Sanjay

CM KCR : బండి సంజయ్ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వరి పంట అంశంపై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అని ప్రశ్నించారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొడితే దేశ ద్రోహులైపోతారు? దేశం దురాక్రమణకు గురికాకుండా చూడాలంటే నేను దేశ ద్రోహినా? నేను చైనాలో డబ్బు దాచుకుంటానా? పోయిపోయి చైనాలో డబ్బు దాచుకుంటారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అబద్ధాలతో బతికే పార్టీ బీజేపీ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో పండించే ధాన్యాన్ని కేంద్రం కొంటదా? కొనదా? చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

కేంద్రం సమాధానం చెప్పేవరకు వదిలిపెట్టమని అన్నారు. యాసంగిలో వడ్లు వేయండి.. మెడలు వంచి కొనిస్తామని అన్నారా లేదా? ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు కావాలని ఇప్పటికీ చెబుతున్నానని కేసీఆర్ స్పష్టంచేశారు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవాలని ఏపీకి సూచించామని, కృష్ణా నదిలో నీళ్లు లేవు.. గోదావరి నుంచి తెచ్చుకోవాలని చెప్పామని కేసీఆర్ గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల నీటి అవసరాలు తీరాక ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లొచ్చని చెప్పానని అన్నారు. నేను అడిగిందేంటి?.. నువ్వు చెప్పిందేంటి? నువ్వు వరి పండించాలని బాధ్యతారాహిత్యంగా చెప్పిన మాట నిజం కాదా? 62 లక్షల ఎకరాల్లో వరి పండుస్తున్నాయో, లేదో చూపిస్తాని  అన్నారు. అవసరమైతే 6 హెలికాప్టర్లు పెడతా.. రా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి పడాల్సినవి పడటంతో వడ్ల విషయంలో సైలంట్ అయ్యావని విమర్శించారు. ఇకపై ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతానని అన్నారు.

నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లు సంజయ్ వ్యవహారముందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కర్నాటకలో ప్రభుత్వాన్ని కూలగొట్టి.. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారని, మధ్యప్రదేశ్ లోనూ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామికం కాదా? దీన్ని ప్రశ్నిస్తే తప్పా? తెలంగాణలో 107 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. మీకు లొంగి.. మీరు చెప్పింది వింటే వాళ్లు మంచోళ్లు, దేశభక్తులా? అని అన్నారు. మా హద్దులు మాకు తెలుసు.. నేనేమన్నా హద్దుమీరి మాట్లాడానా? అని సూటిగా ప్రశ్నించారు.
Read Also : TDP Protest on Petrol Rates : టీడీపీ ఆధ్వర్యంలో రేపు పెట్రోల్ బంకుల వద్ద ధర్నా

మీ విధానాల్ని ప్రశ్నిస్తే వాళ్లు దేశద్రోహులుగా ముద్రవేస్తారా? అని కేసీఆర్ మండిపడ్డారు. ప్రశ్నించేవాళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయించడమే మీ స్టైల్.. అని విమర్శించారు. మీ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. మా హద్దులు మాకు తెలుసు.. నేనేమన్నా హద్దుమీరి మాట్లాడానా? దళితుడ్ని ముఖ్యమంత్రి చేయకపోయినా.. మళ్లీ ఎన్నికల్లో గెలిచామన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేయకపోవడానికి కారణాలున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు ఒక్క జిల్లా పరిషత్ అయినా గెలిచారా? అని ప్రశ్నించారు. తర్వాతి ఎన్నికల్లో నా నిర్ణయానికి తెలంగాణ ప్రజలు ఆమోదం తెలిపారని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో మీరు ఒక్క జిల్లా పరిషత్ అయినా గెలిచారా? మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మాత్రం గెలిచారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకన్నా ఎక్కువ గెలిచారా? తెలంగాణ కోసం ఎన్నోసార్లు రాజీనామా చేసి.. మళ్లీ గెలిచానని కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ ఒక్క జాతికైనా మీరు న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. మీలాగా గోల్ మాల్ మాటలు మాట్లాడమని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ హైలెట్స్ :

జోనల్ చట్టానికి ఆమోదం తెలపడానికి ఆరేడు నెలలు తీసుకున్నారు

తాజా అంచనాల ప్రకారం.. 60-70వేల ఉద్యోగ ఖాళీలున్నాయి

కేంద్ర ప్రభుత్వం ఏడాదికి కోటి ఉద్యోగాలు పీకేస్తోంది.

నిరుద్యోగిత తక్కువున్న రాష్ట్రం తెలంగాణ

తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడనే ప్రశ్న జోక్ఆఫ్ ది మిలీనియం

నేను ఏం చేశానో మీ మంత్రులే పార్లమెంటులో చెప్పారు

రాజీనామాలకు, పదవులకు మేం భయపడతామా?

చిత్తు కాగితాల్లా రాజీనామాలు విసిరికొట్టాం

కరోనా వస్తే ప్రైవేటు పాఠశాల సిబ్బందిని ఆదుకున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ

మీరు వలస కూలీల్ని వాళ్ల ఖర్మకు వదిలిపెట్టారు

మేం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించాం

పెట్రోల్, డీజిల్ పై సెస్ విత్ డ్రా చేసుకుంటారా? లేదా?
మీ పాలసీ ఏంటో చెప్పండి.
మేం వ్యాట్ పెంచామని అబద్ధం చెప్తున్నారు
మేం వ్యాట్ పెంచలేదు.. క్రమబద్ధీకరించాం
పెంచిన పెట్రోల్ పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వలేదు
కరోనా సమయంలో రాష్ట్రాల్ని ఆదుకోవాలని కోరినా.. మీరు మందుకు రాలేదు.
మా ప్రాణాలున్నంత వరకు తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లడతాం
దేశ ఖజానాలో మా వాటా ఉంది.
దేశ ఖజానా మీ అయ్య సొత్తు కాదు.
మీకు దొంగలు భయపడతారు.. మేం ఎందుకు భయపడతాం..?
కేసీఆర్ ఫాంహౌస్ దున్నడానికి నువ్వు ట్రాక్టర్ డ్రైవర్ వా?
మాకు మనీ లాండరింగ్ లు.. కంపెనీలు.. దందాలు లేవు
మీరు మమ్మల్ని మేం చేయలేరు.
సూట్ కేసులు ఇచ్చేది మీరు నేను కాదు..
ఎన్నికల్లో అతి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది బీజేపీనే
ఇకపై మేం ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటామని 2014లోనే చెప్పా
ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి చేర్చుకుంటాం
యోగ్యత ఉన్నవారికి మంత్రి పదవులు ఇస్తాం
కేబినెట్ లో ఉద్యమకారులే ఉంటారా?
ఉద్యమకారులకు కూడా కొన్ని పదవులు దక్కుతాయి
కాంగ్రెస్ నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి ఎందుకిచ్చారు?
తెలంగాణలో పండిన వడ్లను కొనేదాకా వదిలిపెట్టం
నా ఫాంహౌస్ లోకి అడుగుపెడితే ఆరు ముక్కలు అవుతావు
నాది ఫార్మర్ హౌస్.. మీలాగా గెస్ట్ హౌస్ కాదు..
తెలంగాణ ప్రజలు ఏ పాత్ర ఇస్తే.. ఆ పాత్ర పోషిస్తాం.
గెలిపిస్తే సర్వీసు చేస్తాం.. లేకపోతే ప్రతిపక్షంలో ఉంటాం
ఎవరికీ అధికారం శాశ్వతంగా ఉండదు
ఒక విజయానికి పొంగిపోయి బీరాలు పలకం
ఒక అపజయానికి కుంగిపోం
తెలంగానలో పండే వడ్లు కొంటారా.. లేదా?
వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో ధర్నా చేస్తాం
లక్షలాది మంది రైతులతో ధర్నా చేస్తాం

భూభాగం కాపాడమన్నోడు దేశదోహ్రి అవుతాడా?
నేను ఉద్యమకారుడ్ని.. ఎవరికీ భయపడేవాడిని కాదు
2001లో కారు చీకట్లు ఉన్నప్పుడు ఉద్యమాన్ని మొదలుపెట్టా
ఎంపీలు, ఎమ్మెల్యేల్ని ఎంతోమందిని నేను సృష్టించా
మిషన్ భగీరథ లాంటి స్కీమ్ మీ కలలోనైనా వచ్చిందా?
ఏడేళ్లుగా ట్రిబ్యునల్ వేయమంటే మీకు ఎందుకు చేతకావట్లేదు?
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు ఎందుకు పోయామో తెలుసా?
అపెక్స్ కౌన్సిల్ లో ఉండేదే ముఖ్యమంత్రులు
అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లకపోతే మన వాదన ఎవరు వినిపిస్తారు?
ఏపీలో 7 మండలాన్ని కలిపినప్పుడు మీరు ఎక్కడున్నారు?
సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నప్పుడు మోదీని ఫాసిస్ట్ ప్రధాని అన్నా
కేసీఆర్ ఎక్కడికి పోవాలో.. నువ్వు చెప్తావా?
నీకు ఫెడరల్ ఫ్రంట్ అర్జెంట్ గా కావాలా?
శుక్రవారం మాతో ధర్నాకు నువ్వు కూడా వస్తావా?
దయచేసి వరి వేయొద్దని రైతులకు మళ్లీ చెప్తున్నా
వీళ్లను నమ్మితే శంకరగిరి మాన్యాలు పడతాం
దేశవ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే కట్టారా?
ప్రజల మనసుల్ని కలుషితం చేస్తున్నారు
మా పార్టీకొచ్చే విరాళాల్ని కూడా మేం లెక్క చెప్తున్నాం
టీఆర్ఎస్ కు రూ.450 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఓపెన్ గా చెప్పాం
ధరణి పోర్టల్ తో అవినీతి లేకుండా పోయింది
అధికార దుర్వినియోగంతో ఏమైనా చేయాలనుకుంటే మీరే గోల్ మాల్ అవుతారు
ఎలాంటి ఎంక్వైరీకి అయినా సిద్ధమని చెప్తున్నా
పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనేదాకా పోరాటం చేస్తాం
ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్స్ కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి
చాలామంది రైతులు లక్షల ఎకరాల్లో పంట వేసి విత్తన కంపెనీలకు అమ్ముకుంటున్నారు
సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు వరి ధాన్యం పండించుకోవచ్చు
మిల్లర్లతో, వ్యాపారులతో ఇప్పుడే ఒప్పందం ఉంటే వరి వేసుకోవచ్చు
కేంద్రాన్ని నమ్ముకుని మాత్రం వరి వేసుకోవద్దు
తెలంగాణ రైతుల్ని కాపాడుకోవాలనేదే మా ప్రయత్నం
తెలంగాణ పత్తికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది
కేంద్రం కొనడానికి నిరాకరించబట్టే.. వరి వద్దంటున్నాం
ఎవరివి నక్కజిత్తుల మాటలో రైతులు గుర్తించాలి
రైతు వేదికల్లో కూర్చొని రైతులు చర్చించుకోవాలి
ఇతర పంటలు ఏం వేస్కోవాలో చెప్తాం
రైతులకు సీడ్స్ అందుబాటులోకి తెస్తాం

దళితబంధు లాంటి స్కీం ప్రపంచంలోనే ఎక్కడా లేదు.
హుజూరాబాద్ లో దళితబంధుకు రూ.2వేల కోట్లు రిలీజ్ చేశాం
ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్ ఇస్తాం
దళితులు పైకి రావాలన్న ఉద్దేశంతోనే దళితబంధు పెట్టాం
దళితబంధు పథకాన్ని వందశాతం అమలు చేస్తాం
హుజూరాబాద్ లో ప్రతీ దళిత కుటుంబానికి దళిబంధు ఇస్తాం
ఇప్పటికే ఎంపిక చేసిన 4 మండలాల్లో వందశాతం దళితబంధు అమలు చేస్తాం
ఈ మార్చిలోగా ప్రతీ నియోజకవర్గంలో వంద కుటుంబాలకు దళితబంధు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇస్తాం
ఉద్యోగ నియామకాల్లో 95శాతం లోకల్ రిజర్వేషన్ సాధించి పెట్టాం
ఎన్ని ఉద్యోగాలు వచ్చినా 95శాతం స్థానికులకే వస్తాయి
రెండు, మూడ్రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం
ఉద్యోగుల సర్దుబాటు పూర్తయ్యాక 60-70వేల ఖాళీలు పూర్తి చేస్తాం
దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పాం

 తెలంగాణ రైతుల ముందు మిమ్మల్ని పంచనామా చేస్తాం
మీరు కేసీఆర్ తో మాట్లాడుతున్నారు… గుర్తు పెట్టుకోండి
నిజాం షుగర్ ప్యాక్టరీ విషయంలో గతంలోనే చెప్పా
నిజాం షుగర్ ఫ్యాక్టరీని కొని.. రైతులకే అప్పగిస్తామన్నాం
మహారాష్ట్ర తరహాలోనే నడుపుకుంటామంటే రైతులకే ఇస్తామన్నాం
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తీసుకునేందుకు రైతులు తిరస్కరించారు
మనకు అత్యంత లాభసాటి పంట పత్తి
లక్ష ఎకరాల్లో పత్తి సాటు చేయొచ్చు
ఒకేసారి కోత కోసే పత్తి వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది
యాసంగిలో శనగలు వేసుకోండి.. బ్రహ్మండంగా అమ్ముడుపోతాయి
మినుములు వేస్తే మన వ్యవసాయ శాఖ కొంటుంది
తెలంగాణ వచ్చేనాటికి 27 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి
ఇప్పుడు 400 జిన్నింగ్ మిల్లులకు చేరాయి
సీసీఐతో సంబంధం లేకుండా పత్తిని మిల్లులే కొంటున్నాయి