Telangana CM KCR : గాంధీకి సీఎం కేసీఆర్..కరోనా వైద్య సేవల పరిశీలన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి రానున్నారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. వైద్య ఆరోగ్య, శాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా..గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు.

Telangana CM KCR : గాంధీకి సీఎం కేసీఆర్..కరోనా వైద్య సేవల పరిశీలన

Gandhi

Gandhi Hospital : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి రానున్నారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. వైద్య ఆరోగ్య, శాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా..గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు. ఈ శాఖను చూసిన ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. 2021, మే 19వ తేదీ బుధవారం మధ్యాహ్నం 01 గంటకు ప్రగతి భవన్ నుంచి నేరుగా గాంధీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గాంధీ పరిసర ప్రాంతాలను సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు.

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకోనున్నారు. ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు ? తదితర వివరాలపై ఆరా తీయనున్నారు. అనంతరం వైద్యులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. మెరుగైన వైద్య చికిత్సపై ప్రధానంగా చర్చించనున్నారు. ఆసుపత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ? వెంటిలెటర్ పరిస్థితి, ఆక్సిజన్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.

గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని కూడా సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొంటోంది. పొరుగు రాష్ట్రాల నుంచి పలువురు రోగులు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తోంది.

Read More : Corona Test: మాకు కరోనా లేదు… పరీక్షలు చేయొద్దు