CM KCR: నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. లక్ష మందితో బహిరంగ సభ.. పర్యటన షెడ్యూల్ ఇలా

సీఎం కేసీఆర్ తొలిసారి నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సాయంత్రం జరిగే బహిరంగ సభకు లక్ష మందిని తరలించేలా..

CM KCR: నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. లక్ష మందితో బహిరంగ సభ.. పర్యటన షెడ్యూల్ ఇలా

CM KCR

KCR Nirmal District Tour: సీఎం కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంను ప్రారంభిస్తారు. అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో సుమారు 16ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ విధానంలో రూ. 56 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. కలెక్టరేట్ సముదాయానికి నిరంతరాయ విద్యుత్ ను అందించేందుకు ప్రత్యేక సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

CM KCR : తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం నా అదృష్టం : సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం గులాబీ మయంగా మారింది. కలెక్టరేట్ కు వెళ్లే దారిపొడవునా భారీ ప్లెక్సీ కటౌట్లు, హోర్డింగ్‌లను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ భవనంతో పాటు, బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అదేవిధంగా సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఈ మూడు ప్రాంతాల పరిధిలో బందోబస్తు కోసం దాదాపు ఐదువేల మంది పోలీసులు జిల్లాకు చేరుకున్నారు. నలుగురు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 300 మంది సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

CM KCR : JPSలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పర్మినెంట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్, విధివిధానాలకు ఆదేశం

సీఎం కేసీఆర్ తొలిసారి నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సాయంత్రం జరిగే బహిరంగ సభలో సుమారు లక్ష మందిని తరలించేలా బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు. సభకు వచ్చేవారికి రవాణా సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు జన సమీకరణకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారు.

Odisha Train Accident : గతంలోనూ పలుసార్లు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఆ సమయంలో ఎంత మంది మరణించారంటే?

సీఎం పర్యటన ఇలా..

సీఎం కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3. 15 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరుతారు. 3.20 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4.30 గంటలకు నిర్మల్ కు చేరుకుంటారు. 4.40 గంటలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 5.50 గంటలకు జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 6.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7.30 గంటలకు సభ ముగించుకొని 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.