Vasalamarri Village : దత్తత గ్రామానికి సీఎం కేసీఆర్, గ్రామస్తులతో సహపంక్తి భోజనం

పల్లె, పట్టణ ప్రగతి బాట పట్టనున్న సీఎం కేసీఆర్‌.. ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. దత్తత గ్రామంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది.. ఇంకేం చేయాలనే దానిపై స్వయంగా పరిశీలించనున్నారు. గ్రామస్తులతో కలిసి సామూహిక భోజనం కూడా చేయనున్నారు. దీనిపై గ్రామ సర్పంచ్‌కు ఫోన్‌ చేసి మరీ మాట్లాడారు సీఎం కేసీఆర్‌.

Vasalamarri Village : దత్తత గ్రామానికి సీఎం కేసీఆర్, గ్రామస్తులతో సహపంక్తి భోజనం

Cm Kcr

CM KCR : పల్లె, పట్టణ ప్రగతి బాట పట్టనున్న సీఎం కేసీఆర్‌.. ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. దత్తత గ్రామంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది.. ఇంకేం చేయాలనే దానిపై స్వయంగా పరిశీలించనున్నారు. గ్రామస్తులతో కలిసి సామూహిక భోజనం కూడా చేయనున్నారు. దీనిపై గ్రామ సర్పంచ్‌కు ఫోన్‌ చేసి మరీ మాట్లాడారు సీఎం కేసీఆర్‌.

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ గతేడాది నవంబర్ 1న ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు వెళ్లే సమయంలో స్వయంగా ఆ గ్రామంలో ఆగి గ్రామస్తులతో ముచ్చటించారు కూడా. తర్వాతి రోజు అధికారులు.. స్థానిక ప్రజాప్రతినిధులతో సుమారు నాలుగు గంటలపాటు సమీక్షించారు. తన వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు.

ఇందుకోసం వంద కోట్లు కేటాయిస్తామని, గ్రామంలో ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అవసరమైతే అంతకంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని మాట ఇచ్చారు. మరో పది రోజుల్లో గ్రామాన్ని సందర్శిస్తానని.. గ్రామస్తులందరితో కలిసి భోజనం చేస్తానని గ్రామ పెద్దలకు హామీనిచ్చారు. నాటి హామీని ఈ నెల 22న నిలబెట్టుకోనున్నారు. ఇక దత్తత తీసుకుంటానని ప్రకటించిన వెంటనే.. గ్రామాభివృద్ధి కోసం ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నాటి జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. దీంతో హుటాహుటిన వాసాలమర్రిని సందర్శించిన నాటి కలెక్టర్ అనితా రామచంద్రన్… కావాల్సిన సదుపాయాల గురించి స్థానికులతో చర్చించారు.

గ్రామస్తుల సలహాలు, సూచనలు స్వీకరించి.. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన హామీ మేరకు ఈనెల 22న వాసాలమర్రి గ్రామాన్ని సీఎం సందర్శిస్తున్నారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేద్దామని.. సభ జరుపుదామని అందుకనుగుణంగా విశాలమైన ప్రదేశంలో ఏర్పాట్లు చేయాలని స్వయంగా సర్పంచ్ అంజయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో హుటాహుటిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు గ్రామాన్ని సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇక సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల వాసాలమర్రి వాసులు.. జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.