CM KCR : చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్, సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చర్చ

శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్..

CM KCR : చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్, సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చర్చ

Cm Kcr

CM KCR : శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు. యాగశాల ప్రాంగణం అంతా కలియతిరిగారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. యాదాద్రి ఆలయం పున:ప్రారంభం పైనా స్వామీజీతో మాట్లాడారు కేసీఆర్. మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం ఏర్పాట్లపైనా చర్చించారు.

Coconut Water : కొబ్బరి నీరు సేవించటం వల్ల శరీరానికి మేలే!

భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్ లోని ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల ముగింపు రోజు అయిన ఫిబ్రవరి 14న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరవుతారు.

Xiaomi 11i Offer: రూ. 867కే Xiaomi 11i స్మార్ట్‌ఫోన్‌ పొందవచ్చు.. ఆఫర్ తెలుసుకోండి!

ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ముచ్చింతల ఆశ్రమంలో దాదాపు 200 ఎకరాలకు పైగా స్థలంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని నిర్మించారు. 216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహాన్ని సిద్ధం చేశారు. మొత్తం 12 రోజుల పాటు సహస్రాబ్ది వేడుకలు జరగనున్నాయి. 1035 హోమ గుండాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్వహించనున్నారు.