KCR Delhi Tour : ఢిల్లీలో కేసీఆర్.. మొహల్లా క్లినిక్, సర్వోదయ స్కూల్ సందర్శన

ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యా విధానం గురించి తెలుసుకున్నారు.

KCR Delhi Tour : ఢిల్లీలో కేసీఆర్.. మొహల్లా క్లినిక్, సర్వోదయ స్కూల్ సందర్శన

Cm Kcr Delhi Tour (1)

KCR Delhi Tour : దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించారు. అక్కడి విద్యా విధానం గురించి అరవింద్ కేజ్రీవాల్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్‌ తిలకించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం బృందం పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించింది.

CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ

కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ, పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు కేజ్రీవాల్. స్కూల్ సందర్శన తర్వాత మహమ్మద్‌పూర్‌లోని మోహల్లా క్లినిక్‌ను కేసీఆర్ సందర్శించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మోహల్లా క్లినిక్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది.

ఢిల్లీలో పలు పార్టీల కీల‌క నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, దేశ ప‌రిస్థితులు, ప్రాంతీయ పార్టీల బ‌లాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాల‌పై చ‌ర్చించారు. గ‌త‌ ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పైనా చర్చించారు. దాదాపు రెండున్నర గంటల పాటు వీరి సమావేశం సాగింది.

Cm Kcr

Cm Kcr

జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. దేశవ్యాప్త పర్యనటకు శ్రీకారం చుట్టారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీ చేరుకున్నారు. శుక్ర‌వారం రాత్రి ఢిల్లీలోనే బ‌స చేశారు. శ‌నివారం రాజ‌కీయ‌, ఆర్థిక రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో భేటీ అవుతున్నారు. ఆ త‌ర్వాత జాతీయ మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తోనూ కేసీఆర్ భేటీ కానున్నారు.

CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!

త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆదివారం ఛండీగ‌ఢ్ వెళ్ల‌నున్న కేసీఆర్ అక్క‌డే ఏకంగా నాలుగు రోజుల పాటు గ‌డ‌ప‌నున్నారు. నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సాగిన ఉద్య‌మంలో మృతి చెందిన రైతుల కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ వెంట ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్‌, భ‌గ‌వంత్ మాన్‌లు పాల్గొంటారు. మృతి చెందిన రైతుల కుటుంబాల‌కు కేసీఆర్ రూ.3 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం చేయ‌నున్నారు.

CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్‌ ఫోకస్.. ఢిల్లీకి సీఎం కేసీఆర్‌