T Hub-2 : రేపే టీ హబ్‌-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్‌ 2 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. మూడెకరాల్లో 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు.

T Hub-2 : రేపే టీ హబ్‌-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌

T Hub

T Hub-2 Center‌ : దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్‌-2 ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. రేపు సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్‌.. హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టంకు ఊతమిస్తుందన్నారు. ఐటీ కారిడార్‌ రాయదుర్గంలో ఐదేళ్లుగా నిర్మాణంలో ఉన్న టీ-హబ్‌ రెండో దశ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్‌ 2 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. మూడెకరాల్లో 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. భారత్‌లో ఇదే అతి పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌. ప్రపంచంలో రెండో అతిపెద్దదిగా నిలవనున్న ఈ భవనాన్ని 3.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. టీ హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు. వీటిలో మొదటిది దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీదుగా హోటల్‌ ఐటీసీ కోహినూర్‌ పక్కన నుంచి వచ్చే రోడ్డు, రెండవది.

KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు

మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి ఐకియా స్టోర్‌ ఎదురుగా ఉండే రోడ్డు, మూడవది రహేజే మైండ్‌ స్పేస్‌ ఎస్‌ఈజెడ్‌ నుంచి రాయదుర్గం బయోడైవర్సిటీ చౌరస్తాకు కలిసి రోడ్డు. నాల్గో రోడ్డు.. రాయదుర్గం- మాదాపూర్‌ వెళ్లే రోడ్డు నుంచి నాలెడ్జ్‌ సిటీని కలిపే రోడ్డు. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ (పాత ముంబై హైవే)ను కలిపే రోడ్డు. ఇలా.. మొత్తం 5 విశాలమైన రోడ్లతో కూడలి ఉండటం దీని ప్రత్యేకత. నగరం నలుమూలల నుంచి ఏ మార్గంలో వచ్చినా టీ హబ్‌కు సులభంగా చేరుకునేలా రోడ్డు మార్గాలు ఉన్నాయి.

ముఖ్యంగా అత్యాధునిక ప్రజా రవాణా సాధమైన మెట్రో రైలు మార్గంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నాలెడ్జ్‌ సిటీకి సమీపంలోనే ఉంది. అటు రోడ్డు మార్గం, ఇటు మెట్రో మార్గం ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రజా రవాణా పరంగా అత్యంత అనుకూలంగా మారింది. కొత్త భవనంలో ఒకేసారి 15వందల స్టార్ట్‌ ఆప్‌లకు చోటు కల్పించవచ్చు. స్టార్ట్‌ ఆప్‌లతో పాటు వెంచర్‌ క్యాపిటలిస్టులకూ ఇందులో ఛాన్స్‌ ఉంది.

Huge Investment : తెలంగాణలో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడులు

యూనికార్న్‌ స్టార్ట్‌ప్‌లు, మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌ కేర్‌, డెలివరీ వ్యవస్థాపకులతో పాటు సీక్యా క్యాపిటల్‌, యాక్సిల్‌, ఎండియా పార్ట్‌నర్స్‌, కలారి క్యాపిటల్‌ లాంటి వెంచర్‌ , మారుతి సుజూకి, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌, లాంటి కార్పొరేట్‌ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మూడు ప్రధాన విద్యా సంస్థల మధ్య ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ఏర్పాటైన సంస్థ టీ హబ్‌. 2015లో స్టార్టప్‌లను ప్రభుత్వపరంగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో దీని ప్రస్థానం ప్రారంభమైంది.

ఈనెల 28న నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాలెడ్జ్‌ సిటీ ఎస్‌ఈజెడ్‌లోని రోడ్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధునీకరణ పనులు చేపడుతుండటంతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు సైతం టీహబ్‌-2 ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.