CM KCR Visit Jagityala : నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడంతోపాటు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణంలోని హెలీపాడ్ కు చేరుకుంటారు.

CM KCR Visit Jagityala : నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

CM KCR visit Jagityala

CM KCR Visit Jagityala : సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడంతోపాటు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణంలోని హెలీపాడ్ కు చేరుకుంటారు.

మధ్యాహ్నం 12.35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు వైద్య కళశాల భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

CM KCR Inaugurated : మహబూబ్‌నగర్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

మధ్యాహ్నం 1.15 గంటలకు సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటల వరకు మోతె శివారులోని బహిరంగ సభా స్థలానికి చేరుకుంటారు. సభలో ప్రసంగించిన తర్వాత సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ లో తిరిగి ఎర్రవల్లి ఫాం హౌస్ కు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యదారి బాలమల్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సభకు 2 లక్షల మంది హాజరవుతారని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.