CM KCR : కరీంనగర్ కు సీఎం కేసీఆర్..ఆపరేషన్ హుజూరాబాద్

సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

CM KCR : కరీంనగర్ కు సీఎం కేసీఆర్..ఆపరేషన్ హుజూరాబాద్

Cm Kcr

Huzurabad Etela Rajender : సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ రాజీనామా, విమర్శలు, ఆరోపణల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్న వేళ కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ హుజూరాబాద్‌పై గులాబీ బాస్ మరింత ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే హుజూరాబాద్‌లో కింది స్థాయి కార్యకర్తలు మొదలు టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. ఉపఎన్నిక ముగిసేవరకూ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తునట్లు అర్థమవుతోంది. హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్‌ఎస్ అధినేత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో కరీంనగర్ పర్యటనలో… ఆపరేషన్ హుజూరాబాద్ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. హుజూరాబాద్‌ను పూర్తిగా టీఆర్ఎస్ దిగ్బంధనం చేసేలా… ఈటలకు ఎక్కడా ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా..పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ కరీంనగర్ పర్యటన తర్వాత హుజురాబాద్ రాజకీయం మరింత రక్తి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Read More : Etela Rajender TRS Party : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల