Yadadri : హైదరాబాద్ కు సీఎం కేసీఆర్, యాదాద్రిలో మూడు గంటల పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.

Yadadri : హైదరాబాద్ కు సీఎం కేసీఆర్, యాదాద్రిలో మూడు గంటల పర్యటన

Kcr Yadadri

CM KCR Tour : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు. 2021, జూన్ 21వ తేదీ సోమవారం వరంగల్ పర్యటన ముగించుకున్న సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో యాదాద్రికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా..ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం..గోల్డ్ కలర్ లైటింగ్ ను తిలకించారు. విద్యుత్ దీపాలతో ధగధగలాడుతున్న యాదాద్రిలో కలియతిరిగారు. అంతకంటే ముందు…వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా… ముందుగా మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో అత్యాధునిక వసతులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇదిలా ఉంటే…జిల్లాల్లో వరుస పర్యటనలు సీఎం కేసీఆర్ నిర్వహిస్తుండడంతో నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది. పర్యటనలు, ప్రారంభోత్సవాలు, ప్రసంగాల దూకుడుతో…ప్రత్యర్ధులను గుక్కతిప్పుకోనీకుండా చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం కేసీఆర్ జిల్లాల్లో వరుసగా పర్యటిస్తుండడం… ప్రతిపక్షాలపైనా పంచ్‌లు విసురుతుండడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో….సీఎం కేసీఆర్‌ దూకుడు పెంచారు. జిల్లాల్లో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. సీఎం టూర్‌తో ఆయా జిల్లాల నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.