CM KCR : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం

మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.

CM KCR : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం

CM KCR (1)

KCR Manchiryala Tour : సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రూ.1658 కోట్లతో చెన్నూర్ ఎత్తిపోతల పతాకాన్ని శంకుస్థాపన చేయనున్నారు. మందమర్రిలో రూ.500 కోట్లతో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు.

మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మండలంలోని పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంచిర్యాల మెడికల్ కాలేజ్, ఆసుపత్రి శాశ్వత భావన నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన కేసీఆర్ చేస్తారు.

Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి?

శుక్రవారం కొత్త పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించే గృహలక్ష్మీ పథకం, రెండో విడత గొర్రెల పంపిణీలకు శ్రీకారం చుట్టనుంది.

సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లించారు.