CM KCR : వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించనున్నారు. ఇటీవల వడగళ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మొక్కజొన్నతోపాటు భారీ స్థాయిలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.

CM KCR : వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR (1)

CM KCR : తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించనున్నారు. ఇటీవల వడగళ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మొక్కజొన్నతోపాటు భారీ స్థాయిలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికను అధికారులు కేసీఆర్ కు అందించారు. నివేదికను పరిశీలించిన కేసీఆర్ నేరుగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ (గురువారం) ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్ట పోయిన పంటలను పరిశీలించనున్నారు. బాధిత రైతులను పరామర్శించనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. రామాపురంలో పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించనున్నారు.

Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు.. ఈదురుగాలులు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలు

అకాల వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 33 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. అత్యధికంగా బోనకల్ మండలంలో పంట నష్టం వాటిల్లింది. ఈ మండలంలో 10, 324 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా వర్షాలతో ఈ పంట పూర్తిగా చేతి కందకుండా పోయింది. అనంతరం సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాకు బయల్దేతారు. పెద్దవంకర మండలం రెడ్డికుంట తండాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలిస్తారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు.

అక్కడి నుంచి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులను అడిగి వివరాలు తెలుసుకుంటారు. సీఎం వారికి భరోసా కల్పిస్తారు. మహబూబాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.  భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రామడుగు, చొప్పదండి, గంగధార మండలాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

Telangana Rains : అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షాలు

బాధిత రైతులను ఓదార్చనున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 23,116 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చొప్పదండి నియోజకవర్గంలోని మండలాల్లో 11,409 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రామడుగు మండంలో 5,825 ఎకరాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో 7,695 మంది రైతులు నష్టపోగా, ఒక్క రామడుగు మండలంలోనే 4,053 మంది రైతులు నష్ట పోయారు.