తెలుగు రాష్ట్రాల్లో చలి..చలి, @8.4 డిగ్రీలు

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 01:30 PM IST
తెలుగు రాష్ట్రాల్లో చలి..చలి, @8.4 డిగ్రీలు

Cold in Telugu states..cold, @ 8.4 degrees : తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. కుమ్రంభీమ్‌ జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా బెలలో 8.6 ఢిగ్రీలు, తాంసిలో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూలేదని విధంగా కశ్మీర్‌ను తలించేలా ఉష్ణోగ్రతులు నమోదువుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. చలికి తట్టుకోలేక మంటలు వేసుకుంటున్నారు.



అటు ఏపీలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. విశాఖపట్నం జిల్లా అరకు లోయలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. లంబసింగి సహా కొన్ని ప్రాంతాల్లో జీరో డిగ్రీలకు చేరుకుంది. ఇంకొన్ని చోట్ల 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నవంబర్‌లోనే ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నట్టు గుర్తించారు.