విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 08:18 AM IST
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా సర్పంచ్‌ కవితను జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొనకుండా, ఇష్టానుసారంగా వ్యవహరించాడు. (కుల, మత రహిత సామూహిక స్మశాన వాటికలు : సీఎం కేసీఆర్ )

స్థానికంగా ఉండకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సర్పంచ్ పై చర్యలు తీసుకున్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మార్చి 4వ తేదీన బుగ్గపల్లితండాలో పల్లెనిద్ర కార్యక్రమానికి వెళ్లిన తనకు గ్రామస్తులు సర్పంచ్‌పై ఫిర్యాదు చేయ్యడంతో కలెక్టర్‌కు నివేదికను అందజేసినట్లు డీపీవో రాజేశ్వరి తెలిపారు. నివేదిక ప్రకారం సర్పంచ్‌ కవితను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో చెప్పారు. ఆరు నెలల తర్వాత కలెక్టర్‌ ఆదేశాలనుసారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.(చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచ్ పదువులు ఊడుతాయ్ : సీఎం కేసీఆర్ )