Y.S.Sharmila: యాసంగిలో వరి సాగుచేయని రైతులకు పరిహారం ఇవ్వాలి..

తెలంగాణ రైతుల పాలిట యముడు సీఎం కేసీఆర్ అంటూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాసంగి ప్రారంభంలో వరి సాగుచేయొద్దని ..

Y.S.Sharmila: యాసంగిలో వరి సాగుచేయని రైతులకు పరిహారం ఇవ్వాలి..

Ys Sharmila

Y.S.Sharmila: తెలంగాణ రైతుల పాలిట యముడు సీఎం కేసీఆర్ అంటూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాసంగి ప్రారంభంలో వరి సాగుచేయొద్దని రైతుల పొలాలు బీడ్లు పెట్టేలా సీఎం కేసీఆర్ చేశాడని విమర్శించారు. యాసంగిలో వరిసాగు చేయని రైతులకు కేసీఆర్ పార్టీ ఫండ్ రూ.860కోట్ల నుంచి పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వను అని సంతకం చేసింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. ఇది దిక్కుమాలిన ప్రభుత్వమని, కేసీఆర్ మొదటి నుంచి యాసంగి ధాన్యం విషయంలో తప్పులు చేస్తూనే ఉన్నాడని విమర్శించారు.

YS Sharmila : తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారు? : వైఎస్ షర్మిల

17లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయలేదని, వరి సాగుచేయని రైతుల పరిస్థితి ఏమిటని షర్మిల ప్రశ్నించారు. వరి సాగుచేయని రైతులకు తక్షణమే పరిహారం అందించాలన్నారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి బయటకు వచ్చి గ్రామాల్లో తిరగాలని, రైతులు, ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. 24గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఏడు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మద్దతు ధరపై బోనస్ ఇచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్రెడిబులిటీ లేదన్నారు.

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడను.. ముందస్తు ఎన్నికలొస్తే మాకే మంచిది -వైఎస్ షర్మిల

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ అని కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో పాలన బాగుందని పాలకులే చెప్పుకుంటున్నారని, ఒక్క వర్షం పడితే తట్టుకోలేని పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉందన్నారు. తెరాస ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును షర్మిల ప్రస్తావించారు.