Bandi Sanjay : మరికొద్దిసేపట్లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది.

Bandi Sanjay : మరికొద్దిసేపట్లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ

Bandi Sany Smriti Irani

Bandi Sanjay : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది.   పాదయాత్రలో పాల్గోని  బండి సంజయ్  తొలిదశ పాదయాత్ర ముగిసినట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు.  ప్రచార రధం పై బండి సంజయ్ తో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ  రోడ్ షో లో పాల్గోని మరి కొద్ది సేపట్లో అంబేద్కర్ చౌరస్తాకు చేరుకోనుంది.  ఆగస్ట్‌ 28న చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర 36 రోజులపాటు 438 కిలోమీటర్లు.. 8 జిల్లాలు.. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 6 పార్లమెంట్‌ నియోజకవర్గాలలో సాగింది. తొలిదశ పాదయాత్ర ముగిసిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టిని పెట్టబోతున్నారు.

పాదయాత్రలో ఉన్నప్పటికీ.. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి రాష్ట్రస్థాయి నేతలతో మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నాయకులతో చర్చిస్తున్నారు. ఇవాళ హుస్నాబాద్‌లో యాత్ర ముగిసిన తరువాత హజూరాబాద్‌కు వెళ్తారు. 36రోజుల పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు. జనం బాధలు విన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలతోనూ మాట్లాడారు. బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతిచోటా ఘనస్వాగతం లభించింది. తొలి దశ పాదయాత్రను విజయవంతంగా ముగించబోతున్న బండి సంజయ్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి అభినందించారు. క్యా బండీ.. కైసో హో.. అచ్చా కియా.. వైసీ హీ ఆగే చలో.. అంటూ ఎంకరేజ్ చేశారు. మంచి పని చేశావ్.. అలాగే ముందుకెళ్లు అంటూ అభినందించారు. ఇక, నేటి హుస్నాబాద్ మహాసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని సెంటరాఫ్ అట్రాక్షన్ కానున్నారు.