T.MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్..నాలుగు జిల్లాలకే పరిమితమా?
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పాల్గొంటోంది. మరి ఈసారి అయినా హస్తం అభ్యర్థులు గెలుపు సాధిస్తారా?

congress Participating in the mlc elections : తెలంగాణలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడులైన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా..నామినేషన్ల హడావిడి కొనసాగింది. నామినేషన్లకు ఇదే చివరి రోజు. ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించటం నామినేషన్లు వేయటం కూడా జరిగింది. ఇంకా కొంతమంది నామినేషన్లు వేయాల్సి ఉంది. అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ హుజూరాబాద్ ఎన్నికల అపజయం తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడానికి రెడీగా ఉంది. మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో అనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది.
దీనిపై నిర్ణయం తీసుకోవటానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా..? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ మేరకు 12 స్థానాల్లో బలం అధికంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ తరుపున బరిలోకి దించాలని నిర్ణయం జరిగింది. ఈ క్రమంలో ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి రాయల్ నాగేశ్వర్రావుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీ ఫామ్ అందజేశారు. మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డికి కాంగ్రెస్ భీ ఫామ్ దక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖమ్మం -నాగేశ్వరరావు, మెదక్-నిర్మల జగ్గారెడ్డి, నిజామాబాద్-మహేష్ కుమార్‌గౌడ్, వరంగల్-వేం వాసుదేవరెడ్డిలను పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని భావించింది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి. కానీ అంచనాలు తల్లక్రిందులయ్యాయి. తెలంగాణ ఇచ్చి ఇటు తెలంగాణలోను..అటు ఏపీలోను పత్తాలేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈక్రమంలో అధిష్టానం తెలంగాణలో తిరిగి పుంజుకోవటానికి నానా పాట్లు పడుతోంది. కానీ తెలంగాణలో సీనియర్ లీడర్లే ఉన్నా..వారి మధ్య సమోధ్య ఏమాత్రం ఉండదు. ఎప్పుడు తగవులే. ఆధిపత్య ధోరణులే. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిష్టానం అధ్యక్ష పదవిని ఇచ్చింది. దీంతో సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. కానీ చేసేదేమీ లేదు. రేవంత్ రెడ్డిలో ఉన్న ఫైర్ ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ కు అవసరం అని నమ్మిన అధిష్టానం రేవంత్ ను నమ్మింది.
తనపై అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి రేవంత్ యత్నిస్తున్నారు. రేవంత్ అధ్యక్ష పదవి చేపట్టాక పలు కార్యక్రమాలతో హడావిడిచేస్తున్నారు. టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల ఓటమి తరువాత ఢిల్లీలో టీ. నేతలతో పోస్టుమార్టం చేసింది అధిష్టానం. ఈ సమావేశంలో కూడా నేతల అదే తీరుగా ఉన్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు. విమర్శలు చేసుకున్నారు.
Read more : Priyanka Gandhi Son : LV ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ప్రియాంక గాంధీ కుమారుడికి పరీక్షలు
అయినా సరే రేవంత్ రెడ్డి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేరు. దీంతో సుదీర్ఘ సస్పెన్స్ కు తెర దించుతు..మరోపక్క శషభిషలకు తెరదించుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు పార్టీ ప్రకటించింది. హుజూరాబాద్ ఓటమి, అంతముందు జరిగిన జీహెచ్ఎంసీ, దానికంటే ముందు దుబ్బాక.. ఇలా అన్ని చోట్లా వైఫల్యాలే ఎదురవుతోన్న క్రమంలో సరైన బలం లేకుండా బరిలోకి దిగి ఓడిపోయి పరువుపోగొట్టుకోవడం ఎందుకనే భావనను పార్టీలోనేని నేతలందరూ వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఏ కొద్దిగా ఉన్న అవకాశాలను కూడా వదలుకోరాదనీ తీర్మానించుకున్నారు. రోజుల తరబడి మంతనాల తర్వాత ఎట్టకేలకు ఎమ్మెల్సీ బరిలో నిలవాలని తెలంగాణ కాంగ్రెస్ డిసైడైంది.
మొత్తం 12 ఎమ్మెల్సీలకూ పోటీ జరుగనుండగా, కాంగ్రెస్ మాత్రం తనకు ఏ కొంచెమో అవకాశమున్న నాలుగు జిల్లాల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా, సోమవారం రాత్రి కాంగ్రెస్ తన అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో ఈరోజే నామినేషన్ల గడువు ముగియనుండగా..అభ్యర్తుల నామినేషన్లు వేయాల్సి ఉంది.
- Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
- పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
- Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
- Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
- CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
1Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
2NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
3NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
4Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
5CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
6RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
7IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
8Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
9IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
10Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్