Haath se haath Jodo: ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ 2 నెల‌ల పాటు నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో కార్య‌క్ర‌మం ములుగు జిల్లా మేడారం నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ భార‌త్ జోడో యాత్ర‌కు కొన‌సాగింపుగా దేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా నేటి నుంచి తెలంగాణలో ఈ యాత్రను ఎమ్మెల్యే సీతక్కతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించారు.

Haath se haath Jodo: ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

Haath se haath Jodo

Haath se haath Jodo: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ 2 నెల‌ల పాటు నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో కార్య‌క్ర‌మం ములుగు జిల్లా మేడారం నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ భార‌త్ జోడో యాత్ర‌కు కొన‌సాగింపుగా దేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా నేటి నుంచి తెలంగాణలో ఈ యాత్రను ఎమ్మెల్యే సీతక్కతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించారు.

‘‘సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతో.. సోదరి సీతక్క (కాంగ్రెస్ ఎమ్మెల్యే) తోడుగా.. తెలంగాణ ప్రజల బతుకు మార్చేందుకు మేడారం నుంచి నిరంకుశ దొర పాలనపై దండయాత్ర’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం గద్దెల వద్ద ‘‘సీఎం రేవంత్.. సీఎం రేవంత్’’ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలను సందర్శించి రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు.

మేడారంలో అమ్మవార్లను దర్శించిన తర్వాత రేవంత్ రెడ్డి కొద్ది దూరం మాత్రమే పాదయాత్ర చేశారు. అనంతరం తమ వాహనశ్రేణితో గోవింద రావు పేట ప్రాజెక్ట్ నగర్ కు బయలుదేరారు. నిర్దేశిత ప్రాంతంలోనే ఆయన పాదయాత్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే పొడెం వీరయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, తదితర నేతలు ఉన్నారు.

మరోవైపు, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ హైదరాబాద్ నుంచి పస్రాకు బయలుదేరారు. ఎన్డీఏ, బీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌ను ఈ పాదయాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తామ‌ని టీపీసీసీ నేత‌లు చెప్పారు. రేవంత్ రెడ్డి 50 నియోజ‌క వ‌ర్గాల్లో పర్యటిస్తారు. కాంగ్రెస్ నేతల పర్యటనల కోసం నాలుగు కారవాన్లను స‌న్న‌ద్ధం చేశారు.

Mercedes Car Owner Throws Cash : డబ్బు మదం : బెంజ్‌ కారులో వచ్చి కరెన్సీ నోట్లు విసిరేసిన వ్యక్తి..కన్నీళ్లు పెట్టుకున్న మహిళ