Jaggareddy : బీజేపీ ఎజెండాతో కేసీఆర్‌ పని చేస్తున్నారు : జగ్గారెడ్డి

కేవలం 8 ఎంపీ సీట్లున్న కేసీఆర్‌...57 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. అది తెలియని కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎలా సక్సెస్ అవుతారని పేర్కొన్నారు.

Jaggareddy : బీజేపీ ఎజెండాతో కేసీఆర్‌ పని చేస్తున్నారు : జగ్గారెడ్డి

Jaggareddy

Jaggareddy comments : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉనికి లేదనడం కేసీఆర్ మూర్ఖత్యం అని అన్నారు. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని దించేస్తానని అనడం కలలో మాట అన్నారు. బీజేపీ ఎజెండాతో కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారని విమర్శించారు. కాంగ్రెస్ లేకుండా సాయం చేస్తామని ఏ పార్టీ నేతైనా కేసీఆర్ తో చెప్పాడా అని నిలదీశారు.

కేవలం 8 ఎంపీ సీట్లున్న కేసీఆర్‌…57 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. అది తెలియని కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎలా సక్సెస్ అవుతారని పేర్కొన్నారు. పరోక్షంగా కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నట్లే కదా అని అన్నారు. మోడల్ అనే పదం కేసీఆర్ ఊత పదం అయిపోయిందని ఎద్దేవా చేశారు.

MLA Jaggareddy : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సెవెన్‌ స్టార్‌ ఫామ్‌హౌజ్‌లో కూర్చుని కేసీఆర్‌ ముంగేరి లాల్‌ కలలు కంటున్నాడని, ఆ కలలు ఫలించవని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. 8 ఏళ్ల క్రితం బంగారు తెలంగాణ కలలు కన్న కేసీఆర్‌..మరి సాధించాడా అన్నారు.