Madhu Yashki : లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై విచారణ జరిపించాలి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలి-మధుయాష్కీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, ఏ పార్టీ నేతలు ఉన్నా విచారణ జరపాల్సిందే, శిక్షించాల్సిందే అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Madhu Yashki : లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై విచారణ జరిపించాలి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలి-మధుయాష్కీ

Madhu Yashki : ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ పాలసీ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉందని, కేసీఆర్ కూతురు కవిత హస్తం ఉందని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని బీజేపీ ఎంపీ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా మరింత సంచలనం రేపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీజేపీ నేతలు కవితను టార్గెట్ చేశారు.

తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యహారంలో కాంగ్రెస్ నేతలపై అనవసరపు ఆరోపణలు చేయొద్దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపైనా కేంద్రం విచారణ జరిపించాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నా బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదు అని ఆయన ప్రశ్నించారు.

TRS MLC Kavitha : 33 కోర్టుల్లో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా

‘చౌకబారు నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు. కల్వకుంట్ల కుటుంబం పరిపాలన దోపిడీ చేస్తోంది. దీంతో యావత్ తెలంగాణ సమాజం నష్టపోతోంది. తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ మేల్కోవాలి. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో భాగస్వామ్యం కండి.

లిక్కర్ స్కామ్, ఇసుక దందాతో కల్వకుంట్ల కుటుంబం కొన్ని వేల కోట్లు కొల్లగొట్టింది. ఇవాళ ఆఖరికి మన బిడ్డల జీవితాలతో ఆడుకునే మద్యం విక్రయాల్లో ఆడబిడ్డ అయిన కవితమ్మకు పాత్ర ఉందంటే అత్యంత దారుణం ఇది. హేయమైన చర్య. సిగ్గుమాలిన చర్య. ఏ విధంగా డబ్బులు వచ్చినా తినడానికి సిద్ధంగా ఉన్నారు. శవాలపైన కూడా తినడానికి సిద్ధమైన చంద్రశేఖర్ రావు కుటుంబం. అవినీతికి పాల్పడితే నా కొడుకు అయినా నా బిడ్డ అయినా అరెస్ట్ చేస్తానని కేసీఆర్ గతంలో అన్నారు.

కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన వ్యక్తి ఇవాళ గుంటనక్కలా మారి తెలంగాణను దోచుకుంటున్నాడు. దీనిపై తిరుగుబాటు చేయాల్సిందే. తెలంగాణ సమాజం కలిసి రావాలని కోరుకుంటున్నాం. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, ఏ పార్టీ నేతలు ఉన్నా విచారణ జరపాల్సిందే, శిక్షించాల్సిందే. ఇది మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలి’ అని మధుయాష్కీ డిమాండ్ చేశారు.

Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ ప్రమేయం-బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ స్కామ్ దెబ్బకు నిన్నటి వరకు ఎంతో హీట్ పుట్టించిన మునుగోడు ఉప ఎన్నికల అంశం కూడా పక్కకు వెళ్లిపోయింది. పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సింగ్.. కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలపై కవిత సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తన తండ్రి కేసీఆర్ ను బద్నాం చేయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. వారిపై ఆమె పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టులలో ఆమె పరువునష్టం దావా వేశారు. మరోవైపు నిన్న కవిత ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టిన 29 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు.