Kaushik Reddy : టీఆర్ఎస్ లోకి హుజురాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి?

హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

Kaushik Reddy : టీఆర్ఎస్ లోకి హుజురాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి?

Congress Leader

Kaushik Reddy :  హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇదే అంశంపై కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కాంగ్రెస్ నేతల అభిప్రాయం కోరనున్నారు. ఆదివారం వీణవంకలో హుజురాబాద్ కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానే పోటీచేస్తానంటూ కొద్దీ రోజుల క్రితం ప్రచారం కూడా ప్రారంభించారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చిన నాటి నుంచి ఆయన పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి తనను టికెట్ రాదనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం.

కాగా గతంలో ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను కలిశారు కౌశిక్ రెడ్డి ఈ సమయంలోనే అతడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, ఏ పార్టీలోకి వెళ్లలని స్పష్టం చేశాడు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలతో భేటీ అయినట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ లోకి చేరేందుకు కౌశిక్ రెడ్డి సుముఖత చూపినట్లు సమాచారం.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కౌశిక్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ చేతిలో భారీ తేడాతో ఓటమి చవిచూశారు. ఇక ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాదనే అభిప్రాయంలో ఉన్నారు కౌశిక్.. ఈ నేపథ్యంలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.