సర్జికల్ స్ట్రైక్ అంటే..TRS, MIM లకు ఆగమాగం ఎందుకు – విజయశాంతి

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 10:50 AM IST
సర్జికల్ స్ట్రైక్ అంటే..TRS, MIM లకు ఆగమాగం ఎందుకు – విజయశాంతి

Congress leader Vijayashanti : పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహిస్తామన్న బండిసంజయ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడిపై టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగాయి. తాజాగా..నటి విజయశాంతి రెస్పాండ్ అయ్యారు. సర్జికల్ స్ట్రైక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వరుసగా ఆమె ట్వీట్ చేశారు.



MIM నేత గతంలో చేసిన వ్యాఖ్యలు :-
ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే భయాందోళనలకు టీఆర్ఎస్ గురవుతోందని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని, ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందని… పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని… తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా? అని నిలదీశారు.
ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకు?” అని ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించిన మంత్రి కేటీఆర్… ఇన్నేళ్ళూ టీఆర్ఎస్ మిత్రపక్షంగా (ఇప్పుడు కాదంటున్నారు) ఉంటూ వచ్చిన ఎంఐఎం పార్టీ ప్రముఖ నేత గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.



ఉమ్మివేస్తే..భాగ్యలక్ష్మీ ఆలయం కూలిపోతుంది :-
‘ప్రముఖ నేత గతంలో తమవారిని 15 నిమిషాలు వదిలిపెడితే హిందువుల జనాభా నిష్పత్తిని వారి మతస్తుల జనాభాతో సమానం చేస్తాన్నాడు. తన వర్గం వారంతా కలసి ఉమ్మివేస్తే చాలు చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయం కూలిపోతుందని పరిహాసం చేశాడు’. అంటూ వెల్లడించారు.


గోమాతను ఉద్దేశించి :-
హిందువులు పవిత్రంగా ఆరాధించే గోమాతను ఉద్దేశించి చులకనగా మాట్లాడాడు. హిందువులపై అంత గుడ్డి ద్వేషమెందుకు?” అని ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కేటీఆర్ గారు ఎందుకు నిలదీయలేదు? దీన్ని బట్టి చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ మత రాజకీయాలకు తెగబడుతోందని స్పష్టమవుతోందని విజయశాంతి వెల్లడించారు.



కాంగ్రెస్ పై అసంతృప్తి :-
పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఈమె బీజేపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కొన్ని వారాల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి… విజయశాంతి నివాసానికి వెళ్లి స్వయంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాగూర్ స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మెత్తబడలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి షాక్‌లపై షాక్‌లు తగులుతున్నాయి.



https://10tv.in/opposition-condemned-the-telangana-bjp-chief-bandi-sanjay-contents/
దూరంగా విజయశాంతి :-
కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి.. ఇటీవలి కాలంలో ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక హోరాహోరీగా జరిగినా…ప్రచార కమిటీకి బాధ్యురాలై ఉండి కూడా.. అటు వైపు కన్నెత్తి చూడలేదు. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్‌ను గెలిపించమని ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కూడా విజయశాంతి ఖండించారు. వెంటనే అలర్టైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం.. రాములమ్మను నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే..విజయశాంతి నుంచి మాత్రం ఎలాంటి సిగ్నల్ రాలేదు.