Telangana Assembly : బీజేపీ, బీఆర్ఎస్‌లలో ‘బి’ ఉంది, గవర్నర్ మూడో ‘బి’ : జగ్గారెడ్డి

గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇప్పటి వరకు పులిలా ఘర్జించి అసెంబ్లీలోకి ఆహ్వానించగానే పిల్లిలా మారిపోయారని ఎద్దేవాచేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ‘బి’ ఉంది. అలాగే బీజేపీలోనూ ‘బి’ ఉంది. గవర్నర్ మూడో ‘బి’ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ పొల్లుపోకుండా చదివేశారని..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రులు రాసిచ్చిందే గవర్నర్ లు చదవుతారు అని అన్నారు.

Telangana Assembly : గవర్నర్ తమిళిసై, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదరినట్లే ఉంది. ఎందుకంటే గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించింది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలను ప్రారంభించింది. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నరర్ తమిళిసైకు స్వాగతం పలికి సభలోకి తీసుకొచ్చారు.

దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇప్పటి వరకు పులిలా ఘర్జించి అసెంబ్లీలోకి ఆహ్వానించగానే పిల్లిలా మారిపోయారని ఎద్దేవాచేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ‘బి’ ఉంది. అలాగే బీజేపీలోనూ ‘బి’ ఉంది. గవర్నర్ మూడో ‘బి’ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ పొల్లుపోకుండా చదివేశారని..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రులు రాసిచ్చిందే గవర్నర్ లు చదవుతారు అని అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బయట పులిలా గర్జించిన గవర్నర్.. అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని ఆరోపించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందన్నారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అన్నారు.

సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన డైరెక్షన్‌లో గవర్నర్ నడిచారని, తప్పని సరి పరిస్థితుల్లో సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై మధ్య రాజీ కుదిరిందని.. చివరకు తుస్సు మనిపించారన్నారు. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే గవర్నర్‌ నడిచారని జగ్గారెడ్డి విమర్శించారు. దానికి గవర్నర్ తమిళిసై ఏమాత్రం అతీతం కాదన్నారు. అందుకే సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే గవర్నర్ నడిచారు అంటూ వ్యాఖ్యలు చేశారని..కేసీఆర్ రాసిచ్చింది గవర్నర్ చదవకపోతే మైక్ కట్ట అవుతంది అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా..సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం..కోల్ట్ వార్ కాదు ఏకంగా బహిరంగ వారే జరిగింది. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవటంతో ఇద్దరు తగ్గారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానం.. గవర్నర్ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డి మరికొందరు నాయకులు గవర్నర్ గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికారు. మరి ముఖ్యంగా సీఎం కేసీఆర్ గవర్నర్ కు నమస్కరించి స్వయంగా ఆహ్వానించి సభకు తీసుకొచ్చారు. అనంతరం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు.







                                    

ట్రెండింగ్ వార్తలు