Telangana Politics : రాజగోపాల్ రెడ్డి పాండవులను వీడి..కౌరవుల పంచన చేరుతున్నారు..ఓటమి ఖాయం

ఇన్నాళ్లు ఆదరించిన కాంగ్రెస్ పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టడని ..పాండవులను వీడిన కర్ణుడిలా రాజగోపాల్ రెడ్డి కౌరవులు పంచన చేరుతున్నారు అంటూ ఆసక్తికర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Telangana Politics : రాజగోపాల్ రెడ్డి పాండవులను వీడి..కౌరవుల పంచన చేరుతున్నారు..ఓటమి ఖాయం
ad

Telangana Politics : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో మునుగోడులో జరుగనున్న ఉప ఎన్నిక భవిష్యత్ కార్యాచరణప ప్రణాళిక కోసం సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎల్పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహాభారతంలో కర్ణుడిలా పాండవులను వీడి కౌరవుల పంచన చేరుతున్నారని..ఇక ఆయన ఓటమి ఖాయం అని..ఇక ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టటం అనేది జరుగదు అంటూ వ్యాఖ్యానించారు.

మునుగోడు ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల విషయంలో గెలుపుపై జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే ఇమేజ్ పెరుగుతుందని..కాంగ్రెస్ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంది కాంగ్రెసే అని అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనపై పోరాటం చేస్తున్నానని..అందుకే పార్టీ వీడుతున్నానని రాజగోపాల్ రెడ్డి చెపుతున్నారని..కానీ పార్టీ వీడి పోరాటం చేయాలా? పార్టీలో ఉండి పోరాటం చేస్తే ఎవరు కాదంటారు?ఎవరు వద్దంటారు? కాంగ్రెస్ పార్టీ వద్దందా?అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి చెప్పే కారణాలు సరైనవి కాదని..పోరాడే అవకాశాలు ఎన్ని వచ్చినా రాజగోపాల్ రెడ్డి వినియోగించుకోలేదని..కాబట్టి పోరాడటానికే రాజీనామా చేస్తున్నానని చెప్పటంలో అర్థం లేదంటూ కొట్టిపారేశారు జీవన్ రెడ్డి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంతగా చెప్పినా రాజగోపాల్ వినలేదని..ఆవేదన వ్యక్తంచేవారు. ఇక కాంగ్రెస్ లో ‘పంచ పాండవులు’ మాత్రమే మిగిలారని..పంచపాండవుల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధర్మరాజులాంటివారని అన్నారు. అలాగే జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్ బాబు అర్జనుడు అంటూ చెప్పుకొచ్చారు. మరి నకులుడు..సహదేవుడు ఎవరో మాత్రం చెప్పలేదు. అలాగే మరి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఎవరో కూడా చెబితే బాగుండేదంటున్నారు రాజకీయ ప్రముఖులు.

ఇన్నాళ్లు ఆదరించిన కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టడని ..టీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని అన్నారు జీవన్ రెడ్డి… మునుగోడులో ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఇమేజ్ పెరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే గవర్నమెంట్ ను ఏర్పాటు చేస్తామని జీవన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి కన్విన్స్ గా రాజీనామా చేయలేదని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తానని రాజగోపాల్ అనడంపై జీవన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ..రాజగోపాల్ రెడ్డి అలా అనడంమంతా చేతగాని తనమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏమన్నా ఉందా? అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు మునుగోడుకు రానున్న ఉప ఎన్నికకు సంబంధమే లేదన్న జీవన్ రెడ్డి… నీ పోరాటానికి పీసీసీ పదవే అడ్డం వచ్చిందా అని ప్రశ్నించారు. అందరూ అలాగే అనుకుంటే ఎవ్వరు కాంగ్రెస్ లో వుండరని అన్నారు

కాగా..తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటంతో గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై సాగుతున్న వివాదం… ఓ కొలిక్కి వచ్చింది. ఎన్నో ఉత్కంఠల మధ్య..కాంగ్రెస్ సీనియర్ నేతల బుజ్జగింపులను కూడా తోసిపుట్టి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు ఎమ్మెల్యే పదవికి కూడా స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ లెటర్ ఇచ్చారు. రాజగోపాల్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం కూడా తెలిపారు. ఇక రాజీనామా చేసేముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. అంతకుముందు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నాననడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.