Jeevan Reddy : తూకం వేయడం లేదు, లారీలు రావడం లేదు- ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

MLC Jeevan Reddy : రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి క్వింటాల్ పై రూ.12 కమిషన్ పొందుతూ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Jeevan Reddy : తూకం వేయడం లేదు, లారీలు రావడం లేదు- ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

Jeevan Reddy(Photo : Twitter)

MLC Jeevan Reddy : జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అనంతరం అక్కడున్న రైతులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కనీసం 25శాతం కూడా ధాన్యం కూడా సేకరించలేదని జీవన్ రెడ్డి అన్నారు. లారీలు రాకపోవడంతో తూకంలో జాప్యం జరుగుతోందన్నారు. రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి క్వింటాల్ పై రూ.12 కమిషన్ పొందుతూ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం తూకం వేయడం లేదని, ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదని ధ్వజమెత్తారు.

Also Read..Congress: “కర్ణాటక” వ్యూహంతో తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో గెలవాలని కాంగ్రెస్ నిర్ణయం.. ఇవి ప్రకటించే అవకాశం..

తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపడతామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అదనపు తూకంతో పాటు, కోత విధిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారు అని అడిగారు. రైతులే అదనపు తూకం వేయాలనేలా తప్పనిసరి పరిస్థితి కల్పిస్తున్నారని వాపోయారు. రైస్ మిల్లర్లను అధికారులు అదుపు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా? అని జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు.