Komatireddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ రంగంలోకి దిగారు. నిన్న రాజగోపాల్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ క్లిప్సింగ్స్‌ను సేకరించారు. నిన్న మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని కామెంట్‌ చేశారు. అంతేకాదు సోనియాగాంధీని ఈడీ విచారించడంపైనా రియాక్ట్‌ అయ్యారు.

Komatireddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌

Komatireddy

Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ రంగంలోకి దిగారు. నిన్న రాజగోపాల్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ క్లిప్సింగ్స్‌ను సేకరించారు. నిన్న మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని కామెంట్‌ చేశారు. అంతేకాదు సోనియాగాంధీని ఈడీ విచారించడంపైనా రియాక్ట్‌ అయ్యారు.

సోనియా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. నిన్నటి ప్రెస్‌మీట్‌తో పాటు రాజగోపాల్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు.. వాటికి ఇచ్చిన వివరణల్ని కూడా సేకరిస్తోంది. గతంలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, సాగర్‌ బై ఎలక్షన్‌పై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యాలు వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వివరణల క్లిప్పింగ్స్‌ కూడా హైకమాండ్‌ సేకరించింది.

Telangana: కేసీఆర్‌ని ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారని బీజేపీలో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్ల వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మర్యాద పూర్వకంగా కలిశానని ఆయన చెప్పారు. షాతో సమావేశం అనంతరం అనేక వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయన్నారు. అమిత్ షాని కలవటం కొత్తేమీ కాదని, గతంలోనూ అనేక సార్లు కలిశానని ఆయన వివరించారు. అందరి సమక్షంలోనే తాను అమిత్ షా తో భేటీ కావడం జరిగిందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ దినపత్రికతో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? తెలంగాణలో మరో ఉపఎన్నిక రాబోతుందా?

కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురికావద్దని ఆయన కోరారు.