Madan Mohan : ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదు : కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఆ పార్టీ నాయకుడు మదన్ మోహన్ రావు విమర్శలు చేశారు.  ఎమ్మెల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు.

Madan Mohan : ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదు : కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు

MADAN

Madan Mohan : కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఆ పార్టీ నాయకుడు మదన్ మోహన్ రావు విమర్శలు చేశారు.  ఎమ్మెల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో ఏడు సార్లు ఓడిపోయారని వెల్లడించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉందన్న షబ్బీర్ అలీ పార్టీ ఎన్నికల్లో అతని కొడుకునే గెలిపించుకోకపోయాడని ఎద్దేవా చేశారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న(ఆదివారం) గాంధారిలో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజికవర్గాలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ చూస్తానని చెప్పడం తప్పు అని అన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ కష్టపడ్డ వాళ్ళకే టిక్కెట్ ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఇలాంటివి మాట్లాడి కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు.

T Congress Politics : కోమటిరెడ్డి బ్రదర్స్‌పై షబ్బీర్ అలీ ఫైర్ .. మీ అన్నదమ్ములిద్దరి మధ్యే సఖ్యత లేదుగానీ అందరిని విమర్శిస్తారంటూ చురకలు

షబ్బీర్ అలీ కామారెడ్డిలో గెలిచి ఎల్లారెడ్డిలో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎవడి సొత్తు కాదు కష్టపడే వారికి టిక్కెట్ వస్తుందన్నారు. ఆదివారం షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తలు అధైర్య పడవద్దన్నారు. ప్రజలు మదన్ మోహన్ ను నాయకునిగా వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉంటానని చెప్పారు. షబ్బీర్ అలీ గారు మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.

షబ్బీర్ అలీ సీడబ్ల్యూసీ కాదు, టీపీసీసీ అధ్యక్షులు కాదు టిక్కెట్ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. ఎఐసీసీ ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి పోటీ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టిక్కెట్ ఇవ్వకూడదనే పాలసీ కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు.