Congress Training Classes : నేటి నుంచి హైదరాబాద్ లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు.. సీనియర్ నేతలు హాజరుకావాలన్న మల్లిఖార్జున ఖర్గే

హైదరాబాద్ లో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు జరుగనున్నాయి. ఈ అవగాహన కార్యక్రమానికి పీసీసీ కార్యవర్గ సభ్యులందరినీ కాంగ్రెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలను సదస్సుకు హాజరవ్వాలని అధిష్టానం కోరింది.

Congress Training Classes : నేటి నుంచి హైదరాబాద్ లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు.. సీనియర్ నేతలు హాజరుకావాలన్న మల్లిఖార్జున ఖర్గే

congress

Congress Training Classes  :హైదరాబాద్ లో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు జరుగనున్నాయి. నగరంలోని బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి పీసీసీ కార్యవర్గ సభ్యులందరినీ కాంగ్రెస్ ఆహ్వానించింది. ఈ సదస్సుకు 350 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేతలను సదస్సుకు హాజరవ్వాలని అధిష్టానం కోరింది.

అయితే ఈ మీటింగ్ కు ఎవరెవరు హాజరవుతారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ధరణి సమస్యలు, పార్టీ ఇన్సూరెన్స్, పార్టీ ఎన్నికల కమిషన్ లోటుపాట్లపై నేతలకు అవగాహన కల్పించనున్నారు. హాత్ సే హాత్ జోడ్ యాత్రపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. పార్టీ సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. బోయిన్ పల్లిలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని నేతలను ఆయన సూచించారు.

Congress Leaders: లోపల చర్చ.. బయట కొట్లాట.. అట్లుంటది కాంగ్రెస్‎లో

దీంతో సమావేశానికి వెళ్లాలా? వద్దా? అనే అంశంలో సీనియర్లు తర్జనభర్జన పడుతున్నారు. అయితే వారం రోజుల వ్యవధిలో అన్ని సర్దుకుంటాయని మల్లిఖార్జున ఖర్గే సీనియర్ నేతలకు హామీ ఇచ్చారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. అసంతృప్త నేతలతో ఫోన్ లో ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు మాట్లాడారు. అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు మాట్లాడారు.