Telangana Politics : పొంగులేటి, జూపల్లితో కాంగ్రెస్ చర్చలు..

మీరు కాంగ్రెస్ లో చేరితే మీరు కోరుకుంటున్నట్లుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ టీమ్ జూపల్లి, పొంగులేటిలతో చర్చలు జరుపుతోంది.

Telangana Politics :  పొంగులేటి, జూపల్లితో కాంగ్రెస్ చర్చలు..

Sunil Kanugulu ponguleti, jupalli

Telangana Politics : బీఆర్ఎస్ నుంచి బయటపడిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను తమ ప్రార్టీలో చేర్చుకోవటానికి కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున సునీల్ కనుగోలు టీం పొంగులేటి, జూపల్లితో చర్చలు జరుపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరిగిందని దానికి సంబంధించి సర్వేలు కూడా జరిపామాని సర్వేలు కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు చూపుతున్నాయని పొంగులేటి, జూపల్లిలకు వివరిస్తోంది సునీల్ అండ్ టీమ్.తాజా సర్వే వివరాలను పొంగులేటి, జూపల్లికి కనుగోలు టీం వివరిస్తోంది. కాంగ్రెస్ లో చేరితే కలిసి వచ్చే అంశాలను కూడా వివరిస్తోంది. మీరు కాంగ్రెస్ లో చేరితే కలిసి వచ్చే అంశాలని వివరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలం పొంగులేటికి వ్యక్తిగతంగా బలం తోడైతే మీరు కోరుకుంటున్నట్లుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ టీమ్ వివరిస్తోంది.

ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా గెలవనివ్వనని..అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వను అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ను గద్దె దించటానికి పనిచేస్తాననంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఉపయోగించుకోవాలనుకుంటోంది. అదే విషయాన్ని గుర్తు చేస్తు సునీల్ కనుగోలు మీరు కాంగ్రెస్ లో చేరితే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేసేద్దామని దానికి మా వద్ద పక్కా ప్లాన్ ఉన్నాయంటూ వివరిస్తున్నారు.

కాగా రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్‌ తెలంగాణ కాంగ్రెస్ కు పనిచేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీ చేరికల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేయడంతో పాటు కాంగ్రెస్ విజయానికి పక్కా ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలై ఉంటున్న సునీల్ కనుగోలు టీమ్ బీఆర్ఎస్ నుంచి సస్పన్షన్ వేటు పడిన తరువాత వీరిద్దరిని పార్టీలో చేర్చుకోవటంపై కాంగ్రెస్ తరపున సునీల్ కనుగోలు టీమ్ చర్చలు జరుపుతోంది. కాగా..సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలపై సునీల్‌ కనుగోలును హైదరాబాద్, సైబర్ క్రైమ్ విచారించిన విషయం తెలిసిందే.