Marri Shashidhar Reddy : బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి? క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత

బీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారాయన.

Marri Shashidhar Reddy : బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి? క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత

Marri Shashidhar Reddy : బీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారు. తాను ఢిల్లీ వచ్చిన విమానంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఉన్నారని చెప్పారు. మనవడి స్కూల్ ఫంక్షన్ కోసమే తాను ఢిల్లీ వచ్చానని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తాను తరుచుగా ఢిల్లీ వస్తుంటానని చెప్పారు. తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని, రిటైర్ కాలేదని గుర్తు చేశారు మర్రి శశిధర్ రెడ్డి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మర్రి శశిధర్ రెడ్డి.. బీజేపీ నేత డీకే అరుణతో కలిసి ఢిల్లీ వెళ్లారని, ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కొంత కాలం క్రితం పీసీసీ చీఫ్ పై మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు చేశారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో అంటీ ముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. అయితే, పార్టీ మార్పు వార్తలను మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు. కలిసి ప్రయాణిస్తే పార్టీ మారుతున్నట్టా? అని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు.

మునుగోడు ఉపఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. కంచుకోట లాంటి ప్రాంతంలో కూడా డిపాజిట్ కూడా దక్కపోవడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఫలితంతో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తమ భవిష్యత్తుపై కాస్త ఆందోళనగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం మొదలైంది.

మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. బీజేపీ నేతలతో(డీకే అరుణ) కలిసి ఆయన వెళ్లారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. బుధవారం సాయంత్రమే మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారన్న వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా దుమారం రేగింది.

కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులను టార్గెట్ చేసి మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా రేవంత్ రెడ్డికి వంతు పాడుతున్నారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఆ ఇద్దరి వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని కామెంట్ చేశారు.

అంతేకాదు కొంత కాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలోనూ పెద్దగా పాల్గొనలేదు. ఒకటి రెండు సార్లు రాహుల్ కి కనిపించి వెళ్లియారు. జోడో యాత్రలో పెద్దగా పార్టిసిపేట్ చెయ్యలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ టూర్ కాంగ్రెస్ లో కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే, అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు మర్రి శశిధర్ రెడ్డి.