Revanth Reddy: నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాట్ పేరుతో మోదీ 33రూపాయలు, సీఎం కేసీఆర్ 32రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy: నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు -రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy: రాష్ట్రంలో నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాట్ పేరుతో మోదీ 33రూపాయలు, సీఎం కేసీఆర్ 32రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర లీటర్‌కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందని, అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉంటే ఇప్పుడది 105 రూపాయలకు చేరుకుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరలు మోడీ వచ్చిన తర్వాత ఏడేళ్ల కాలంలో నాలుగు వందల యాబై రుపాయలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా కాలంలో కూడా మోడి,సీఎం కేసీఆర్‌లు పేదల జేబుల కొట్టారని, వీళ్ల దోంగలా, బందిపోటు దోంగలా? అసలు వీళ్లను ఏమని పిలువాలి? ఒక దేశం.. ఒకే ఎన్నికలు అని చెప్పే మోడి, పెట్రోల్‌కు దేశమంతా ఒకే ధరను ఎందుకు అమలు చెయ్యట్లేదని ప్రశ్నించారు. పెట్రోల్‌పై నూట యాబై ఐదు శాతం జీఎస్టీ అమలు చేస్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.

రాంజీగోండు, కొమురం భీం స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తీసుకురావడానికి యాత్ర మొదలు పెట్టానని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌కు అధికారం కొత్త కాదని, అధికారం కోసం తహతహలాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.