Sunil Kanugolu: సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన సునీల్ కనుగోలు.. మల్లు రవికి పోలీసుల నోటీసులు

సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలపై పోలీసులు సునీల్‌ను విచారించారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సునీల్ నుంచి పోలీసులు కీలక వివరాల్ని సేకరించారు.

Sunil Kanugolu: సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన సునీల్ కనుగోలు.. మల్లు రవికి పోలీసుల నోటీసులు

Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్, సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరైన సునీల్ విచారణలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు పోలీసులు సునీల్‌ను విచారించారు.

Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై విజయశాంతి ట్వీట్.. క్లారిటీ వచ్చేసినట్లేనా?

సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలపై పోలీసులు సునీల్‌ను విచారించారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సునీల్ నుంచి పోలీసులు కీలక వివరాల్ని సేకరించారు. విచారణ అనంతరం సునీల్ తిరిగి వెళ్లిపోయారు. అయితే, ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు అతడు నిరాకరించాడు. సునీల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించిన జూబ్లీహిల్స్ కార్యాలయంపై గత నవంబర్ 24న సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు జరిపారు. ఆఫీసులోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌తోపాటు పని చేస్తున్న మెండా శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను కూడా అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

London: ఇదేం ట్రెడిషన్ బాబూ.. ప్యాంట్లు తొడుక్కోకుండా లండన్ వీధుల్లో తిరుగుతున్న జనం… కారణమేంటో తెలుసా?

ఈ ముగ్గురి దగ్గరి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దీనిలో సునీల్ కనుగోలు పాత్రే ముఖ్యమైందని గుర్తించారు. అందుకే ఆయనను పోలీసులు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసులు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి కూడా తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్‌పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.