Manickam Tagore On Rahul Tour : రాహుల్ రాకతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది-మాణిక్కం ఠాగూర్

ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను 2002లో సోనియా గాంధీ పరామర్శించారని..2004లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వరంగల్ సభతో..(Manickam Tagore On Rahul Gandhi Tour)

Manickam Tagore On Rahul Tour : రాహుల్ రాకతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది-మాణిక్కం ఠాగూర్

Manickam Tagore On Rahul Gandhi Tour

Manickam Tagore On Rahul Tour : సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ చెప్పేది వేరు, చేస్తున్నది వేరు అని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పని అయిపోయిందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

MLA Jaggareddy : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఠాగూర్ చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను 2002లో సోనియా గాంధీ పరామర్శించారని చెప్పారు. 2004లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వరంగల్ సభతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024లో మళ్లీ సోనియా గాంధీ వరంగల్ వస్తారని ఆయన తెలిపారు.(Manickam Tagore On Rahul Gandhi Tour)

తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ పర్యటనకు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని.. వరంగల్‌ రైతు సంఘర్షణ సభ ద్వారా ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే వరంగల్‌లో పర్యటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు.. స్థానిక నేతలతో సమావేశమై సభ నిర్వహణపై సమీక్షించారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మే 6, 7వ తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మే 6 న వరంగల్ లో రైతు సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మే 7 న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. పర్యటనలో భాగంగా ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఓయూ వీసీని అనుమతి కోరింది. అయితే ఇప్పటివరకు ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతులు రాలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.(Manickam Tagore On Rahul Gandhi Tour)

Harish Rao On Rahul Gandhi : ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం-రాహల్ గాంధీపై తీవ్ర విమర్శలు

కాగా, తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్‌ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్‌ గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని బాల్క సుమన్ చేసిన కామెంట్లు ఇప్పటికే కాక రేపాయి. దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగానే స్పందించారు. బాల్క సుమన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాల్క సుమన్ వ్యవహారాలపై విచారణ జరిపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నీకు పదవి వచ్చి ఉండేదా? అని బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న బాల్క సుమన్, నేడు హరీశ్ రావు.. రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శల డోస్ పెంచారు.