Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.15 కోట్లకు సుపారీ

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.

Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.15 కోట్లకు సుపారీ

Minister Srinivas Goud

Srinivas Goud : తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్‌ బషీరాబాద్‌లో సుపారీ కిల్లర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్ర భగ్నమైంది. మొత్తం ఏడుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి హత్యకు రూ.15 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది.

ఏకంగా ఓ మంత్రినే చంపేందుకు సిద్ధమవడం సంచలనం రేపింది. అయితే, ఈ సుపారీ కిల్లర్లను కలిసింది ఎవరు? వారికి ఆఫర్‌ చేసింది ఎవరు? ఈ కుట్ర వెనుకున్నది ఎవరు? మంత్రిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? హత్య కుట్ర వెనుక ఉన్న అనేక విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

Realtor Murder: మా తమ్ముడిని చంపింది మట్టారెడ్డే: శ్రీనివాస్ రెడ్డి సోదరుడు బాల్ రెడ్డి

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో(Srinivas Goud) పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ను హతమార్చేందుకు మహబూబ్‌నగర్‌కి చెందిన కొందరు వ్యక్తులు సుపారీ గ్యాంగ్‌ని కలిసినట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరులకే డబ్బు ఆశ చూపినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ”విచారణలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ పేర్లు బయటకు వచ్చాయి. గత నెల 26న ముగ్గురుని అరెస్ట్‌ చేశాం. రాఘవేందర్‌ రాజు మరికొందరితో కలిసి హత్యకు కుట్ర చేశారని నాగరాజు చెప్పాడు. నాగరాజు ఇచ్చిన సమాచారంతో కొన్ని ఆధారాలు సేకరించాము. రాఘవేందర్‌ రాజు, మున్నూరు రవి, మధుసూధన్‌రాజు ఢిల్లీలో ఉన్నట్లు తేలింది. ఈ ముగ్గురు మహబూబ్ నగర్ నుంచి విశాఖ.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.

Love Affair : ఫోన్ కాల్ తెచ్చిన తంటా… అనుమానంతో ప్రియురాలు హత్య

వీరి లొకేషన్‌ ట్రేస్‌ చేయగా మహబూబ్ నగర్ లోని ఓ వీఐపీ ఇంట్లో ఉన్నట్లు తేలింది. వారిని ఢిల్లీలో అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తెచ్చాం. వీరికి వీఐపీ డ్రైవర్‌, పీఏ రాజు షెల్టర్‌ అరెంజ్‌ చేశారు. రాఘవేంద్ర రాజు నుంచి పిస్టల్‌ సీజ్‌ చేశాం. రాఘవేంద్రరాజును ప్రశ్నించగా మంత్రి శ్రీనివాస్‌ హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. రాఘవేందర్‌రాజు మొదట ఫారూక్ తో కాంటాక్ట్‌ అయ్యాడు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశాడు. రాఘవేందర్‌రాజు, మధుసూధన్‌రాజు ప్రధాన ఫైనాన్షియర్లు. వీరిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరిస్తాం” అని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

”ఫరూక్, హైదర్ అలీ సుచిత్ర దగ్గర లాడ్జిలో ఉన్నారు. 25వ తేదీన నాగరాజు మరికొంత మంది వెంబడించి హత్య చేయాలని ప్రయత్నం చేశారు. వారి నుండి పరారై పేట్ బషీరాబాద్ లో ఫిర్యాదు చేశాడు. మహబూబ్ నగర్ కి చెందిన యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ లను నిందితులు. వారిని అరెస్ట్ చేశాము. 26తేదీన అరెస్ట్ చేసి 27న రిమాండ్ కి తరలించాము. వీరి విచారణలో ఓ హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. ఢిల్లీలో రాఘవేంద్ర రాజుతో పాటు మరో ముగ్గురు ఢిల్లీలో ఉన్నట్లు తేలింది. వారి కాల్ డేటా లొకేషన్ చూస్తే మహబూబ్ నగర్ కి చెందిన ఓ వీఐపీకి చెందిన క్వార్టర్స్ లో ఉన్నట్లు తేలింది.

వారిని అరెస్టు చేశాము. వీరికి షెల్టర్ ఏర్పాటు చేసింది మహబూబ్ నగర్ కి చెందిన వీఐపీ డ్రైవర్ పీఏ రాజు. రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి నుండి రెండు వెపన్స్ స్వాధీనం చేసుకున్నాం. వీరిని అరెస్ట్ చేసి విచారిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ముందుగా వీరు ఢిల్లీలో ఉన్న ఫరూక్ ను ఆశ్రయించారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో నాగరాజు ఈ వెపన్స్ కొనుగోలు చేసినట్లు తేలింది” అని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.