NTR Trust Bhavan : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలాన్ని స్వాధీనం చేసుకోండి : సీఎం కేసీఆర్ కు లేఖ

సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

NTR Trust Bhavan : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలాన్ని స్వాధీనం చేసుకోండి : సీఎం కేసీఆర్ కు లేఖ

Ntr Trust Bhavan

NTR Trust Bhavan : హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ భవన్ మరోసారి వివాదంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉద్యోగులు సీఎం కేసీఆర్ ను కోరుతూ లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ కు ఇచ్చిన లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో కేసీఆర్ కు విన్నవించారు.

ట్రస్టు పేరుతో టీడీపీ 30 ఏళ్లు లీజుకు తీసుకున్న ప్రభుత్వ స్థలాన్ని ట్రస్టుకు కాకుండా వ్యాపార కార్యకలాపాలను వినియోగిస్తోందని..ట్రస్టు భవన్ లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు ప్రభుత్వం ఇచ్చిన లీజును రద్దు చేయాలని..స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు.

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ లో ఆంధ్రావారి పెత్త‌నం ఎక్కువ‌య్యింద‌ని…తెలంగాణ ఉద్యోగుల‌ను వేధిస్తున్నార‌ని సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు లేఖ రాశారు. ట్ర‌స్ట్ లో ఎల్.ర‌మ‌ణ మాటకు విలువ లేకుండాపోతోందని లేఖలో తెలిపారు. మరి ఈ విష‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌లే తెర వెనుక ఉండి ఈ త‌తంగాన్ని న‌డిపిస్తున్నారా…?లేక ఈ లేఖలో రాజ‌కీయ కోణాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.