సారంగ దరియా పాట నాది, మంగ్లీతో ఎందుకు పాడించారు, నేనెందుకు గుర్తుకు రాలేదు- రేలారే కోమలి

సారంగ దరియా(saranga dariya).. పంటపొలాల్లో పాడుకునే ఓ సాదాసీదా జానపద పాట.. ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆధునిక హంగులతో సినీ తెరపై సందడి చేస్తున్న ఈ పాట.. ఎంత క్రేజ్ సంపాదించిందో అంతే కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసింది.

సారంగ దరియా పాట నాది, మంగ్లీతో ఎందుకు పాడించారు, నేనెందుకు గుర్తుకు రాలేదు- రేలారే కోమలి

controversy on mangli saranga dariya song: సారంగ దరియా.. పంటపొలాల్లో పాడుకునే ఓ సాదాసీదా పాట.. ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆధునిక హంగులతో సినీ తెరపై సందడి చేస్తున్న ఈ పాట.. ఎంత క్రేజ్ సంపాదించిందో అంతే కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా సాంగ్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్, మంగ్లీ వాయిస్, సాయిపల్లవి డ్యాన్స్.. వీటితో.. ఈ పాట.. ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపుతోంది. సుద్దాల మరోసారి తన మార్క్ జానపదాన్ని రుచి చూపించారనే కితాబు అందుతోంది.

అదే సమయంలో ఈ పాటపై వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ అవుతోంది. సారంగ దరియా కూడా ఎత్తిపోతలే అంటూ విమర్శలు వస్తున్నాయి. తెలంగాణకి చెందిన ఈ జానపద పాటని రైటర్ ఎత్తి రాశారని ఆరోపిస్తున్నారు.

ఓ టీవీ షో లో ప్రసారం అయ్యే రేలారే రేలారే జానపద పాటల ప్రోగ్రామ్ లో శిరీష అనే గాయని ఆ పాటను ఆలపించింది. ఆ సమయంలోనూ ఈ పాట దుమ్ము రేపింది. కోమలి నుంచి తీసుకుని శిరీష ఈ పాటను పాడింది.

కాగా, సారంగ దరియా పాట నాదని కోమలి అంటోంది. దాన్ని మంగ్లీతో ఎలా పాడించారని ప్రశ్నిస్తోంది. సారంగ దరియా పాటను మార్చి రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నా పాటను మార్చి రాసి సుద్దాల అశోక్ తేజ క్రెడిట్ కొట్టేస్తున్నారని కోమలి విమర్శించింది.

దీనిపై సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ స్పందించారు. పాటను మార్చి రాయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. జానపదానికి అద్భుత రూపం తీసుకొచ్చేందుకు సారంగ దరియా చరణం తీసుకుని దానికి సినిమాటిక్ యాంగిల్ రచయిత సుద్దాల అశోక్ తేజ అంటున్నారు.

దీనిపై కోమలి తన వెర్షన్ వినిపించారు. సారంగ దరియా పాట నాదే అన్నారు. తన అమ్మమ్మ దగ్గర సేకరించినట్టు చెప్పారు. ఆ పాటను నేనే సేకరించా, నాకే సొంతం అని తేల్చి చెప్పారు. పల్లెల్లో పని చేసే సమయంలో తన అమ్మమ్మ సారంగ దరియా పాట నిత్యం పాడుతూ ఉండేదని కోమలి చెప్పారు. తాను అమ్మమ్మ దగ్గరికి సేకరించాను అని చెప్పింది. ఒక భర్త భార్య పవిత్రతను తెలుసుకోవడమే సారంగ దరియా పాటకున్న మీనింగ్ అన్నారు. ఈ పాటను తీసుకొచ్చిన నేను సుద్దాల అశోక్ తేజకి ఎందుకు గుర్తుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ఆ మంగ్లీ ఎందుకు గుర్తుకొచ్చింది అని అడిగారు. మంగ్లీతో ఎందుకు పాడించారు అని నిలదీశారు. ఇది తనకు చాలా బాధగా ఉందన్నారు. నేను పాడితే ఇంకా బాగుంటుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.