Telangana Corona Active Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. 2వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Corona Active Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. 2వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

COVID19 cases in India

Telangana Corona Active Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు (236) దాటింది. మరోవైపు కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల మార్క్ దాటడం టెన్షన్ పెడుతోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల 026 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 24గంటల వ్యవధిలో మరో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరట కలిగించే విషయమేంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.(Telangana Corona Active Cases)

తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 96వేల 055 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 89వేల 918 మంది కోలుకున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో నేటివరకు 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని(219) అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. ఈ నెల 16న 285 కొవిడ్ కేసులు, 17న 279 కేసులు, 18న 247 కేసులు వచ్చాయి. క్రితం రోజు రాష్ట్రంలో 27వేల 841 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 279 మందికి పాజిటివ్ గా తేలింది.

Bharat Biotech: నాజల్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేసుకున్న భారత్ బయోటెక్

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.

అటు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 12వేలకుపైగానే నమోదవుతున్నాయి. మరోవైపు కొవిడ్ యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతూ 72 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 4లక్షల 46వేల 387 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 12వేల 899 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క మహారాష్ట్రలోనే 3వేల 883 కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి.

Corona Vaccine : ఆరు నెలల శిశువుకు అందుబాటులోకి కరోనా టీకా

ఒక్కరోజు వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 15 మంది కరోనాతో మరణించారు. నేటివరకు కొవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 5లక్షల 24వేల 855కు చేరింది. 24గంటల వ్యవధిలో మరో 8వేల 518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.26 కోట్లు(98.62%) దాటింది.

రికవరీలు తక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 72, 474 (0.17%) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 13,24,591 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ 196.14 కోట్ల డోసులు పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.