Telangana : గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలల్లో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే

Telangana : గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

Telangana (2)

Telangana : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇంద్రేశం గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా సోకింది. ఈమధ్యే ముత్తంగి గురుకుల పాఠశాలలో 48 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి కరోనా సోకింది. ఓ వైపు కేసులు పెరగడం, మరో వైపు ఒమిక్రాన్ ఎంట్రీ దడ పుట్టిస్తోంది. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది.

చదవండి : Corona : 29 మంది విద్యార్థినిలకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచుస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన అధికమైంది. ఇప్పటికే దేశంలో ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో రెండు కర్ణాటకలో నమోదైనట్లు కేంద్రప్రభుత్వం నిర్దారించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకుండా తిరిగితే.. రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి