పురుషుల కంటే మహిళల్లో అత్యధికంగా కరోనా యాంటీబాడీస్

పురుషుల కంటే మహిళల్లో అత్యధికంగా కరోనా యాంటీబాడీస్

Corona antibodies : కరోనా యాంటీబాడీస్ పై సీసీఎంబీ, ఐసీఎమ్ఆర్, భారత్ బయోటెక్ సంయుక్త సర్వే నిర్వహించాయి. 9 వేల శాంపిల్స్ సేకరించి పరిశోధన చేశారు. 10 ఏళ్లు పైబడిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనలు చేశారు. 30 వార్డుల్లో 9 వేల మంది శాంపిల్స్ పరిశోధించారు. వార్డుకు 300 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు.

కొన్ని వార్డుల్లో 70 శాతం, కొన్ని చోట్ల 30శాతం యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించారు. సరాసరిన 50 శాతం నుంచి 60 శాతం యాంటీబాడీస్ ను కనుగొన్నారు. హైదరాబాద్ లో 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు తెలుసుకున్నారు.

పురుషుల కంటే మహిళల్లో అత్యధికంగా కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించారు. మహిళల్లో 56 శాతం, పురుషుల్లో 53 శాతం కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇందులో యాంటీబాడీస్ ఉన్న 75 శాతం మందికి కరోనా సోకినట్లు కూడా తెలియదని సీసీఎంబీ పేర్కొంది. చిన్న కుటుంబాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.