తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు, రెండు మరణాలు

తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు, రెండు మరణాలు

corona cases in telangana: తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,646కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 176 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2లక్షల 96వేల 916కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,780 ఉండగా.. వీరిలో 693 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 34 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 90లక్షల 55వేల 741కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చినా, ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళితే మాస్కు తప్పనిసరి. అలాగే భౌతిక దూరం పాటించడం మర్చిపోకూడదు. తరుచుగా కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. వ్యాక్సిన్ వచ్చేసింది కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.