Corona in Telangana: ఫస్ట్ టైమ్ తెలంగాణలో.. భారీగా కరోనా కేసులు నమోదు..

Corona in Telangana: ఫస్ట్ టైమ్ తెలంగాణలో.. భారీగా కరోనా కేసులు నమోదు..

Corona In Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,446 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఇదే సమయంలో కరోనాతో రాష్ట్రంలో పన్నెండు మంది చనిపోయారు. కరోనా నుంచి గడిచిన 24గంటల్లో 1,414 మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌‌గా ఉన్న కేసుల సంఖ్య 33,514కి చేరుకుంతి. వీరిలో 22,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 598 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా వేవ్ మొదలైనప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైమ్ ఇన్ని కేసులు నమోదు అవ్వడం అని అధికారులు చెబుతున్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, మాస్క్‌లు ధరించి స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు అధికారులు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావిద్దని అధికారులు సూచిస్తున్నారు.