Corona : కేసులు తగ్గాయి.. అయినా జాగ్రత్తగా ఉండండి.. అసలే పండుగ సీజన్

గత మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా.. కొత్తగా 183 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Corona : కేసులు తగ్గాయి.. అయినా జాగ్రత్తగా ఉండండి.. అసలే పండుగ సీజన్

Telangana

Corona :  గత మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా.. కొత్తగా 183 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,68,070కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా మరో ఇద్దరు కొవిడ్‌తో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,932కి చేరింది.

Read More :   ఒక్కో కార్మికుడికి రూ. రూ. 1.15 లక్షలు, 11వ తేదీన చెక్ చేసుకోండి

కరోనా బారి నుంచి నిన్న 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,196 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పండుగ సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రద్దీ ప్రాంతంలో తిరగడం మనాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.

Read More :  మంత్రి కేటీఆర్ కారుకు చలాన్, ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్‌కు సన్మానం