Corona Effect in Hyderabad : బేగంబజార్ లో కరోనా డేంజర్ బెల్స్, పనివేళల్లో మార్పులు

ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.

Corona Effect in Hyderabad : బేగంబజార్ లో కరోనా డేంజర్ బెల్స్, పనివేళల్లో మార్పులు

Begumbazar

Begum Bazar Commercial Market : తెలంగాణలో కరోనా డేంజర్స్ మ్రోగిస్తోంది. పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా వైరస్ విస్తరిస్తోంది. తాజాగా..ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కెట్ లోని దుకాణాల సమయంలో మార్పులు చేయాలని హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరవబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఫిష్‌ మార్కెట్, బేగంబజార్, మిట్టికా షేర్‌ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ కిరాణ దుకాణాలన్నీ నిబంధనలను పాటిస్తాయని, అలాగే వ్యాపారులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది.

తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో..రాష్ట్రంలో మరోసారి పంజా విసురుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. మాస్క్ తప్పనిసరి చేసింది. లేకుంటే..జరిమాన, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో బేగంబజార్ లో ఉన్న దుకాణాలు వారం రోజుల పాటు మూతపడ్డాయి. గత సంవత్సరం జూన్ 28వ తేదీ నుంచి వారం రోజుల పాటు మార్కెట్ ను కిరాణా మర్చంట్ అసోసియేషన్ స్వచ్చందంగా మూసివేసిన సంగతి తెలిసిందే. వ్యాపారం సరిగ్గా నడకపోవడంతో ఆర్థిక నష్టాలను చవి చూశారు వ్యాపారస్థులు. కేసులు తగ్గుముఖం పట్టడంతో వ్యాపారం బాగానే సాగుతుందని అనుకుంటున్న క్రమంలో..మళ్లీ కరోనా పంజా విసరడంతో ఆందోళనలో ఉన్నారు వ్యాపారులు.