Telangana Corona : తెలంగాణలో పరిపాలనపై కరోనా ఎఫెక్ట్..ఆగిపోయిన ఫైల్స్

తెలంగాణను కరోనా సెకండ్ వేవ్‌ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.

Telangana Corona : తెలంగాణలో పరిపాలనపై కరోనా ఎఫెక్ట్..ఆగిపోయిన ఫైల్స్

Kcr

Government Telangana : తెలంగాణను కరోనా సెకండ్ వేవ్‌ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఆనేక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రిన్సిపల్ సెక్రటరితో పాటు అనేక మంది అధికారులు కరోనా సెలవుల్లో ఉన్నారు. దీంతో రోజువారి అధికారిక కార్యక్రమాలకు బ్రేక్‌లు పడుతున్నాయి.

సీఎంకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ముఖ్యమైన వ్యవహారాలను మంత్రి కేటీఆర్ చక్కదిద్దారు. ముఖ్యమంత్రి స్థాయిలోని ఫైల్స్‌ మాత్రం ఆగిపోయాయి. పీఆర్సీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూములను తెలంగాణ ఉద్యోగుల కోసం బదాలయింపు, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు, అర్హులైన స్కూళ్లలో పని చేస్తున్న కోచ్‌ల రెగ్యులరైజేషన్, సెట్విన్ ఉద్యోగుల జీతాల పెంపు లాంటి అనేక అంశాలు ఇప్పుడు పెండింగ్‌లో పడిపోయాయి.

కోవిడ్-19 రూల్స్ ప్రకారం వైరస్ బారిన పడ్డవారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. సీఎం కేసీఆర్‌కు నెగటివ్ రిపోర్ట్ వచ్చినా.. విధుల్లోకి రావడానికి కనీసం పది రోజుల సమయం పట్టే అవకాశముంది. సీఎం కేసీఆర్ మే మొదటి వారం చివరి వరకూ క్వారంటైన్‌లో ఉంటారు. మంత్రి కేటీఆర్‌కు కూడా పాజిటివ్ రావడంతో.. అనేక శాఖల ఫైల్లు ఆగిపోయాయి. ముఖ్యమైన కార్యక్రమాలైన కొన్నింటికి మాత్రమే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ పెద్దలందరూ వైరస్ బారిన పడటంతో ప్రభుత్వ పరిపాలనకు బ్రేకులు పడ్డాయి.

Read More : Justice Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం