కుటుంబాన్ని చిదిమేసిన కరోనా, అత్త మామ, భర్త మృతి..ఒంటరైన గర్భిణీ

  • Published By: madhu ,Published On : July 18, 2020 / 08:46 AM IST
కుటుంబాన్ని చిదిమేసిన కరోనా,  అత్త మామ, భర్త మృతి..ఒంటరైన గర్భిణీ

కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను కన్నీళ్లు తెప్పిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతుండడం..కొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు వెళ్లిపోతుండడం తట్టుకోలేకపోతున్నారు. కుటుంబసభ్యులు తమ మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒక్కోక్కరిది ఒక్కో గాథలా ఉంది. వరంగల్ జిల్లాలో ఓ నిండు గర్భిణీకి జరిగిన విషయం తెలుసుకుని కన్నీళ్లు పెడుతున్నారు. ఇలాంటి బాధ పగవాడికి కూడా రావొద్దంటున్నారు. అంతటి తీవ్ర విషాదం జరిగింది.

వివరాల్లోకి వెళితే : –

వరంగల్ నగరంలోని ఓ కార్యాలయంలో యువతి పని చేస్తుండేది. అందులో పనిచేసే యువకుడు, యువతి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువురు మనస్సులు కలిశాయి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా త్వరలో వారింట్లో బుజ్జాయి రాబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

కరోనా కల్లోల్లం : – 
కానీ వారి సంతోషం కొద్ది రోజులే నిలిచింది. తీవ్ర జ్వరంతో పాటు కరోనా లక్షణాలు కనిపించడంతో భర్తకు 2020, జులై 02వ తేదీన పరీక్షలు చేయించింది. అందులో కరోనా పాజిటివ్ గా వచ్చింది. Warangal MGM ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అత్తా మామలు మృతి : – 
ఈ క్రమంలోనే..యువకుడి తండ్రికి కూడా కరోనా సోకింది. Warangal MGM ఆసుపత్రిలో చేరిపించగా..పరిస్థితి విషమించి..2020, జులై 10వ తేదీ శుక్రవారం మరణించారు. భర్త చనిపోయాడని తెలుసుకుని యువకుడి తల్లి (గర్భిణీ అత్త) మానసికంగా బాధ పడింది. 2020, జులై 12వ తేదీ ఆదివారం ఆమె చనిపోయింది. ఓ వైపు భర్త ఆసుపత్రిలో..మరోవైపు అత్తామామలు చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది గర్భిణీ.

భర్త కూడా మృతి : – 
హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న భర్త…2020, జులై 16వ తేదీ గురువారం చనిపోయాడు. అప్పటికే తీవ్ర దు:ఖంలో ఉన్న ఆమె..భర్త లేడనే విషయం తెలుసుకుని కుప్పకూలిపోయింది. కడుపులో ఉన్న బిడ్డను చూడకుండానే..వారం వ్యవధిలో అత్తా మామలు, భర్త చనిపోవడంతో గర్భిణీ ఒంటరి అయిపోయింది. స్థానికంగా ఈ ఘటన కలిచివేసింది.