Sangareddy : గురుకులంలో కరోనా కలకలం..43 మంది విద్యార్థులకు వైరస్

ముత్తంగిలో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం 43 మందికి కరోనా ఉందని తేలింది. 42 మంది విద్యార్థులుండగా..ఒకరు ఉపాధ్యాయురాలు ఉన్నారు.

Sangareddy : గురుకులంలో కరోనా కలకలం..43 మంది విద్యార్థులకు వైరస్

Gurukul

Corona Gurukul school : తెలంగాణలో కరోనా మళ్లీ భయపెడుతోంది. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అధికంగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో మళ్లీ విజృంభిస్తోందా అనే కలవరం మొదలైంది. సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడి చనిపోతున్నారు. కర్నాటక రాష్ట్రంలో భారీ సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా..తెలంగాణ రాష్రంలోని సంగారెడ్డిలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో..ఆమె వైద్య పరీక్షలు చేయగా..ఇది బయటపడింది.

Read More : Viral Video : సిగరేట్ తాగుతుండగా..కూలిన భారీ వృక్షం, తర్వాత

సంగారెడ్డి జిల్లా పటన్ చెరు మండలం ముత్తంగిలో గురుకుల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరే కాకుండా..27 మంది సిబ్బంది ఉన్నారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. దీంతో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 2021, నవంబర్ 28వ తేదీ ఆదివారం 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read More : Ramagundam : సినిమా చూసి మర్డర్..రామగుండం మీ సేవ ఉద్యోగి హత్య

మొత్తం 43 మందికి కరోనా ఉందని తేలింది. 42 మంది విద్యార్థులుండగా..ఒకరు ఉపాధ్యాయురాలు ఉన్నారు. మిగతా వారికి సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. వైరస్ సోకిన వారి నమూనాలు జీనోమ్ స్వీక్వెన్సింగ్ కు పంపారు. వసతి గృహంలో విద్యార్థులను క్వారంటైన్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.